ధీటైన కంటెంట్‌ తో ఆకట్టుకుంటున్న ఆహా.. సూపర్ హిట్ సినిమాలతో, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న తెలుగు ఓటీటీ..

ధీటైన కంటెంట్‌ తో ఆకట్టుకుంటున్న ఆహా.. సూపర్ హిట్ సినిమాలతో, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న తెలుగు ఓటీటీ..
Aha

AHA Upcoming Movies : తెలుగు  ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తూ అలరిస్తున్న డిజిటల్ దిగ్గజం ఆహా. థియేట్సర్స్ మూసివేయడం తో ప్రజలు డిజిటల్ వైపు పరుగులుపెడుతున్నారు.

Rajeev Rayala

|

Jul 03, 2021 | 6:02 PM

తెలుగు  ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తూ అలరిస్తున్న డిజిటల్ దిగ్గజం ఆహా. థియేట్సర్స్ మూసివేయడం తో ప్రజలు డిజిటల్ వైపు పరుగులుపెడుతున్నారు. అలంటి ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కులు అంచ‌నాల‌కు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో స్థానాన్ని ద‌క్కించుకుంటుంది. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ఇత‌ర డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు ‘ఆహా’ గ‌ట్టి పోటీనిస్తోంది. తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న నాగ‌చైత‌న్య ‘ల‌వ్‌స్టోరి’, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’, నాగ‌శౌర్య ‘ల‌క్ష్య’ చిత్రాలతో పాటు అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘కుడిఎడ‌మైతే’ ఆహాలోనే ప్ర‌సారం కానుంది. ‘ఆహా’లో ప్ర‌సార‌మైన ‘సామ్ జామ్’ వెబ్ షో సాధించిన తిరుగులేని విజ‌యంతో మ‌రిన్ని నాన్ ఫిక్ష‌న‌ల్ కంటెంట్ ‘ఆహా’లో ప్రేక్ష‌కుల‌ను మెస్మైరైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగా లక్ష్మీ మంచు హోస్ట్ చేయనున్న షో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.

ఆహాలో ప్ర‌సార‌మైన ‘సామ్ జామ్’ వెబ్ షో సాధించిన తిరుగులేని విజ‌యంతో మ‌రిన్ని నాన్ ఫిక్ష‌న‌ల్ కంటెంట్ ఆహాతో ప్రేక్ష‌కుల‌ను మెస్మైరైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అలాగే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులైన సూప‌ర్‌స్టార్ ర‌వితేజ‌, రానా, కార్తి, స‌మంత‌, త‌మ‌న్నా, అల్ల‌రినరేశ్‌, ఫ‌హాద్ ఫాజిల్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లైన ‘క్రాక్‌, సుల్తాన్‌, నాంది, లెవ‌న్త్ అవ‌ర్‌, నెంబ‌ర్ వ‌న్ యారి, ట్రాన్స్’ వంటి , డిఫ‌రెంట్ కంటెంట్‌కు ‘ఆహా’ నిల‌యంగా మారింది. ఇలా ప్ర‌తి శుక్ర‌వారం తెలుగు ప్రేక్ష‌కుల‌కు సూప‌ర్ హిట్ కంటెంట్‌ను అందిస్తుంది. అంతే కాదండోయ్..బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను చూడాల‌నుకునే వీక్ష‌కుల కోసం ఆహా జాతీయ‌స్థాయిలో ఇత‌ర డిజిట‌ల్ మాధ్య‌మాల‌తో పోటీప‌డుతూ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంటోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Singer Chinmayi: ‘ఇలాంటి వార్తలతో అలసిపోయాను.. అది మా వ్యక్తిగతం’.. ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ చిన్నయి..

Lakshmi Manchu: మరోసారి టాక్ షో తో అలరించడానికి సిద్దమవుతున్న మంచువారి అమ్మాయి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu