Lakshmi Manchu: మరోసారి టాక్ షో తో అలరించడానికి సిద్దమవుతున్న మంచువారి అమ్మాయి..

సామ్ జామ్‌ షో గుర్తుందా..! ఎలా మరిచిపోతామని అంటారా.. ! ఎస్‌ అలాంటి మరో స్పెషల్ షోను మన కోసం డిజైన్ చేసి ఆహా అనిపించే పనిలో ఉన్నారు ఆహా వారు.

Lakshmi Manchu: మరోసారి టాక్ షో తో అలరించడానికి సిద్దమవుతున్న మంచువారి అమ్మాయి..
Lakshmi Manchu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 03, 2021 | 5:46 PM

Lakshmi Manchu: సామ్ జామ్‌ షో గుర్తుందా..! ఎలా మరిచిపోతామని అంటారా.. ! ఎస్‌ అలాంటి మరో స్పెషల్ షోను మన కోసం డిజైన్ చేసి ఆహా అనిపించే పనిలో ఉన్నారు ఆహా వారు. కొంచెం మాట్లాడుతూ.. మరి కొంచెం ఆటలాడుతూ.. మరింత క్రేజ్‌గా మనల్ని ఎంటర్‌ టైన్ చయబోతున్నారు. అందుకోసం ఓ సూపర్‌ లేడీని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు ఆహా వారు. ఇప్పటికే టాక్‌ షో పేరుతో.. పోష్ ఇంగ్లీష్ స్లాంగ్‌తో ఫుల్ పాపులర్‌ అయిన ఓ బ్యూటీని.. మన ముందుకు తీసుకురాబోతున్నారు. షోను ఇంకాస్త డిఫరెంట్‌గా మనకు ప్రజెంట్ చేయబోతున్నారు. డైలాగ్‌ కింగ్ మోహన్ బాబ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమై.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేస్తున్న బ్యూటీ మంచులక్ష్మీ. థియేటర్‌ ఆర్టిస్ట్ గా.. నటిగా.. షో హోస్ట్ గా.. బొకే ఓనర్‌గా రాణిస్తున్న ఈ లక్ష్మీ… త్వరలో ఆహాలో ఓ షోను హోస్ట్ చేయనున్నారు. “సామ్ జామ్” తరహాలో మ‌రిన్ని నాన్ ఫిక్ష‌న‌ల్ కంటెంట్ను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకురావాలనుకున్న ఆహా.. అందులో భాగంగా లక్ష్మీ మంచును కలిసి ఓ షోను కాన్సెప్ట్‌ను చెప్పేసిందట. అందుకు మంచు లక్ష్మీ ఓకే చెప్పడంతో.. తొందర్లో ఈ షో షూట్ను స్టార్ట్ చేయనుందట ఆహా. ఇప్పుడిదే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని,నాణ్య‌మైన హండ్రెడ్ ప‌ర్సెంట్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ” ఆహా”. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కులు అంచ‌నాల‌కు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకుంటోంది. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ఇత‌ర డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు గట్టి పోటీనిస్తూ… తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. అలాగే టాలీవుడ్ టాప్‌ సినిమాలను ప్రీమియర్స్‌గా స్ట్రీమ్‌ చేస్తూ అందర్నీ ఆకట్టుకుటోంది ఆహా. అలా తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న నాగ‌చైత‌న్య ‘ల‌వ్‌స్టోరి’, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’, నాగ‌శౌర్య ‘ల‌క్ష్య’ చిత్రాలతో పాటు అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘కుడిఎడ‌మైతే’ను త్వరలో స్ట్రీమ్‌ చేయనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Devarakonda: అమెజాన్ ప్రైమ్‏లో ‘ది టుమారో వార్’ సిరీస్ స్ట్రీమింగ్.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్..

Vikram Movie: “విక్రమ్” సినిమాపై అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్.. కమల్ కోసం మరో నేషనల్ అవార్డు విన్నర్..