AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: హీరోయిన్‌ మెహ్రీన్‌ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నట్లు వెల్లడి

టాలీవుడ్‌ హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా సంచలన ప్రకటన చేసింది. ఇటీవల ఆమెకు హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే.

Mehreen Pirzada:  హీరోయిన్‌ మెహ్రీన్‌ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నట్లు వెల్లడి
Mehreen Pirzada
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2021 | 5:34 PM

Share

టాలీవుడ్‌ హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా సంచలన ప్రకటన చేసింది. ఇటీవల ఆమెకు హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. గత మార్చిలో ఎంగేజ్‌మెంట్ కూడా జైపూర్‌ వేదికగా గ్రాండ్‌గా జరిగింది. కాగా ఆ నిర్ణయాన్ని వాళ్లు వెనక్కి తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపింది. తాను ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె పేర్కొంది. భవ్య బిష్ణోయ్​ను పెళ్లి చేసుకోవట్లేదని స్పష్టం చేసింది. ఇది తామిద్దరం చర్చించి తీసుకున్న నిర్ణయమని ట్వీట్ చేసింది.  ఇక నుంచి భవ్య బిష్ణోయ్‌తోగాని అతని కుటుంబ సభ్యులతోనూ ఎలాంటి సంబంధం ఉండబోదని ఆమె తేల్చి చెప్పింది. తన వ్యక్తిగత గోప్యతను అందరూ గౌరవిస్తారని.. ఇక నుంచి తన ఫ్యాన్స్‌ను అలరించేందుకు సినిమాలు చేస్తానని ఆమె వివరించింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అనేది తన వ్యక్తిగత వ్యవహారమన్న మెహ్రీన్ … నటిగా తన బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తానంటూ ట్వీట్‌ చేసింది. మెహ్రీన్‌ అభిమానులు ఈ ప్రకటన చూసి షాక్ అయ్యారు.

మార్చిలో హీరోయిన్​ మెహ్రీన్‌ నిశ్చితార్ధం భవ్య బిష్ణోయ్‌తో జరిగింది. అనంతరం కొవిడ్ పరిస్థితుల కారణంగా తమ పెళ్లిని కొన్నాళ్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా పెళ్లినే రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో మెహ్రీన్‌ తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’ తదితర హిట్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘ఎఫ్‌3’లో మరోసారి హనీగా సందడి చేయనుంది.  సంతోష్ శోభన్​ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్​గా నటిస్తోంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Also Read: స్నేహితుడికి షాక్ కొట్టడంతో ట్రాక్టర్‌పై నుంచి దూకి వెళ్లి అతడిని కాపాడాడు.. కానీ

గ్యాంగ్ రేప్ నిందితులు.. కేసు పెట్టారని బాధితురాలి సోదరుడి మర్మాంగం కోసేశారు