Telangana: స్నేహితుడికి షాక్ కొట్టడంతో ట్రాక్టర్‌పై నుంచి దూకి వెళ్లి అతడిని కాపాడాడు.. కానీ

రుతుపవనాల రాకతో వర్షాలు విరివిగా కురిశాయి. చెరువుల్లో, వ్యవసాయ బావుల్లో పుష్కలంగా నీరు చేరింది. నీటి సౌకర్యం సమృద్ధిగా ఉండటంతో...

Telangana: స్నేహితుడికి షాక్ కొట్టడంతో ట్రాక్టర్‌పై నుంచి దూకి వెళ్లి అతడిని కాపాడాడు.. కానీ
Tractor Fell In Well
Follow us

|

Updated on: Jul 03, 2021 | 4:17 PM

రుతుపవనాల రాకతో వర్షాలు విరివిగా కురిశాయి. చెరువుల్లో, వ్యవసాయ బావుల్లో పుష్కలంగా నీరు చేరింది. నీటి సౌకర్యం సమృద్ధిగా ఉండటంతో అన్నదాతలు వర్షకాల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ రైతు ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో పడి పోయింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ గ్రామ శివారు కేవుల తండాలో వరి నారు విత్తడానికి సన్నద్ధమయ్యారు రైతు భూక్యా నగేష్‌. ట్రాక్టర్ తో నారు మడి దున్నుతుండగా అక్కడే ఉన్న తన స్నేహితుడు నరేందర్ ను వ్యవసాయ విద్యుత్ మోటార్ ఆన్ చేయమని కోరాడు. మోటార్‌ స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురైన నరేందర్ విలవల లాడుతుంటే ట్రాక్టర్ ఇంజన్ ఆఫ్ చేయకుండా నగేష్ అతన్ని కాపాడే ప్రయత్నంలో  పరుగులు తీశాడు. విద్యుత్ వైర్లను వేరు చేసి స్నేహితుడి ప్రాణాలు కాపాడాడు. ఇంతలో రన్నింగ్ లో ఉన్న ట్రాక్టర్ మెల్లిగా కదులుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది. ట్రాక్టర్ యజమాని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

వ్యవసాయ బావిలో నీరు నిండుగా ఉండడంతో రెండు జేసీబీల సాయంతో ట్రాక్టర్ ను మూడు గంటల పాటు శ్రమించి బావి నుండి బయటకు తీశారు. ట్రాక్టర్ పోతే పోయింది కానీ ప్రాణాపాయం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తండా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read: భర్త మారతాడని ఎన్నాళ్లో ఓపిక బట్టింది.. చివరకు తట్టుకోలేక కత్తి బట్టి మట్టుబెట్టింది

కట్నంగా స్విఫ్ట్​ కారును ఇవ్వలేదని ఓ వరుడు ఊహించని పని చేశాడు..