Srinivas Goud: తెలంగాణ నీళ్ల వాటా కోసం ఎంతకైనా తెగిస్తాం.. రాజకీయాలకు అతీతంగా పోరాడుతాంః శ్రీనివాస్ గౌడ్
తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తేలేదని, ప్రాణాలు పోయేంతవరకు పోరాడుతామని రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు
Minister Srinivas Goud comments on Krishna Water: తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తేలేదని, ప్రాణాలు పోయేంతవరకు పోరాడుతామని రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. తెలంగాణ ఎవరు నష్టం చేసిన పార్టీలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ నేతలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించొద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెలంగాణ నీళ్ల ఎవరు దోసుకపోయిన అడ్డం నిలబడతామని స్పష్టం చేశారు.
నదీ జలాల వినియోగంపై తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, జీవోల ప్రకారమే నడుచుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జల వివాదాలపై ఏపీ వితండవాదం చేస్తోందని, కేంద్రం తమకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. లేకపోతే న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కించపరిచేలా మాట్లాడిన అందరం ఏకతాటిపైకి నిలబడి కాపాడుకోవల్సిన అవసరముందని వెల్లడించారు.
దగపడ్డ తెలంగాణ నుంచి వచ్చిన మనం ఎంతో మంది ప్రాణాల త్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ పేరు ఎత్తితే ఎంతో మంది ప్రాణాలు తీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర పేరు ఎత్తలేని పరిస్థితి నుంచి స్వరాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాట్లాడుకోవాలన్నారు. ఏ శక్తి తెలంగాణ అభివృద్ధి అడ్డుకోలేరని స్పష్టం చేసిన మంత్రి.. ఎవరు కలసి వచ్చిన రాకపోయినా తెలంగాణ కాపాడుకుంటామన్నారు.