నిర్మాతలకు సిరియస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్.. ఇకపై సినిమాలను ఓటీటీలకు అమ్మితే….

కరోనా రెండో దశ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. కోవిడ్ కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడడంతో.. పలు చిత్రాల విడుదల వాయిదా పడగా.. షూటింగ్స్ తాత్కలికంగా నిలిచిపోయాయి.

నిర్మాతలకు సిరియస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్.. ఇకపై సినిమాలను ఓటీటీలకు అమ్మితే....
Telangana Film Chambers
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2021 | 6:16 PM

కరోనా రెండో దశ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. కోవిడ్ కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడడంతో.. పలు చిత్రాల విడుదల వాయిదా పడగా.. షూటింగ్స్ తాత్కలికంగా నిలిచిపోయాయి. దీంతో మరోసారి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. వేసవిలో భారీ బడ్జెట్ సినిమాలతోపాటు.. అగ్ర హీరోల సినిమాలు సైతం విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు ప్రేక్షాధరణ మరింతగా పెరిగిపోయింది. ఇందుకు అనుగుణంగా.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కూడా ప్రేక్షకులకు నిరంతరం… సరికొత్త వినోదాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్న చిత్రాలను భారీ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో థియేటర్లు పూర్తి ఆక్యూపెన్సీతో కొనసాగడం సాధ్యమేనా అనే యోచనలో నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ చిత్ర నిర్మాత సైతం.. రోజుకు నాలుగు ఆటలు ఉంటేనే సినిమా విడుదల చేస్తాం అని చెప్పడంతో.. థియేటర్ల యాజమానులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. థియేటర్లు తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ లో థియేటర్ యాజమానులతోపాటు.. నిర్మాతలు కీలక సమావేశం నిర్వహించారు.

కరోనా కారణంగా.. పరిశ్రమలో ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే… థియేటర్స్ యాజమానులు తమ డిమాండ్స్‏ను నిర్మాతల దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు (జూలై 3) నుంచి 2021 అక్టోబర్ 30 లోపు ఏ తెలుగు నిర్మాత తమ సినిమాలను ఓటీటీకి అమ్మవద్దని కోరారు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచే అవకాశం ఉందని.. ఈలోపు నిర్మాతలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో కాకుండా… ఓటీటీలలో విడుదల చేయడం వలన ఇండస్ట్రీలో ముఖ్యమైన భాగాన్ని దెబ్బతీయడమే అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని థియేటర్ యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తమ విజ్ఞప్తిని పట్టించుకోని నిర్మాతల పట్ల భవిష్యత్తులో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

Also Read: Singer Chinmayi: ‘ఇలాంటి వార్తలతో అలసిపోయాను.. అది మా వ్యక్తిగతం’.. ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ చిన్నయి..

Lakshmi Manchu: మరోసారి టాక్ షో తో అలరించడానికి సిద్దమవుతున్న మంచువారి అమ్మాయి..