Director Shankar: ‘ఇండియన్-2’ వివాదం.. హైకోర్టులో డైరెక్టర్‌ శంకర్‌కు ఊరట..

'భారతీయుడు2' వివాదానికి సంబంధించి  డైరెక్టర్‌ శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Director Shankar:  'ఇండియన్-2' వివాదం..  హైకోర్టులో డైరెక్టర్‌ శంకర్‌కు ఊరట..
Indian 2 Controversy
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 03, 2021 | 6:40 PM

‘భారతీయుడు2’ వివాదానికి సంబంధించి  డైరెక్టర్‌ శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో శంకర్‌ తనకు నచ్చిన సినిమాలను తీసుకునే సౌలభ్యం దొరికింది. అంతేకాదు.. లైకా సంస్థ కోరిన రూ.170.23కోట్ల అభ్యర్థనకు కూడా కోర్టు నో చెప్పింది. కమల్‌హాసన్‌ లీడ్ రోల్‌లో ‘భారతీయుడు2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కీ రోల్‌లో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వివిధ కారణాల వల్ల చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ పూర్తి చేశాకే శంకర్‌ తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని నిర్మాణ సంస్థ కోర్టు మెట్లెక్కింది.  శంకర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 2019లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్మాణ సంస్థ షరతులు పాటించలేదని, అలాంటప్పుడు అనుకున్న సమయానికి దర్శకుడు మూవీ ఎలా పూర్తి చేస్తారని సందేహం వెలిబుచ్చారు. పైగా.. ఈ విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు నిర్మాణ సంస్థ ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా డైరెక్టర్‌ను సంప్రదించకుండానే నేరుగా కోర్టును ఆశ్రయించారని విన్నవించారు. మే నెలలో అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం తీర్పును జూన్‌కు వాయిదా వేసింది. సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. తాజాగా మరోసారి ఇరువైపుల వాదనలు పరిశీలించిన మద్రాసు హైకోర్టు డైరెక్టర్‌ శంకర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

అసలు ఏం జరిగిందంటే….

గతంలో కమల్‌హాసన్‌, శంకర్‌ కలయికలో భారతీయుడు చిత్రం వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా ‘ఇండియన్‌2’ను తెరకెక్కించాలనుకున్నారు. అన్నీ మాట్లాడుకున్నాక షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఫస్ట్ చిత్ర నిర్మాణ వ్యయం రూ.270కోట్లుగా అంచనా వేశారు. నిర్మాణ సంస్థ విముఖత వ్యక్తం చేయడంతో చర్చలు జరిపి రూ.250కోట్లకు తగ్గించారు. అయినా కూడా బేదాభ్రిప్రాయాలు రావడంతో రూ.236కోట్లుగా బడ్జెట్‌ను నిర్ణయించారు. డైరెక్టర్‌ శంకర్‌ పారితోషకం రూ.36కోట్లు. కాగా.. షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చిత్రీకరణ ఆగిపోయింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల పునఃప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగానే.. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ పాన్‌ ఇండియా మూవీతో పాటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ని రణ్‌వీర్‌సింగ్‌తో తెరకెక్కించనున్నట్లు శంకర్‌ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ కోర్టును ఆశ్రయించింది. ‘ఇండియన్2’ పూర్తయ్యే వరకూ శంకర్‌ వేరే సినిమాను తెరకెక్కించకుండా చూడాలని కోర్టును కోరింది. వాదోపవాదాలు పరిశీలించిన మద్రాసు హైకోర్టు డైరెక్టర్‌ శంకర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

Also Read: పరుచూరి మల్లిక్‌పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఫిర్యాదు.. నోటీసులు ఇచ్చిన పోలీసులు

హీరోయిన్‌ మెహ్రీన్‌ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నట్లు వెల్లడి