AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paruchuri Mallik: పరుచూరి మల్లిక్‌పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఫిర్యాదు.. నోటీసులు ఇచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా గాజువాక వాసి, కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో....

Paruchuri Mallik: పరుచూరి మల్లిక్‌పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఫిర్యాదు.. నోటీసులు ఇచ్చిన పోలీసులు
Paruchuri Mallik
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2021 | 5:56 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా గాజువాక వాసి, కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో నోటీసులు అందించారు. ఓ టీవీ షోలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. కరోనా వైరస్‌తో ప్రతి ఇంట్లో ఒక మనిషి చనిపోతారంటూ మల్లికార్జునరావు చేసిన కామెంట్స్‌పై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.  వివరణ కోరినప్పటికీ మల్లిక్ స్పందించకపోవడం వల్ల… హైదరాబాద్ సూల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్​లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు గాజువాక పోలీసులను సంప్రదించారు. గాజువాకలోని అల్లూరి టవర్స్​లో ఉన్న మల్లికార్జునరావుకు నోటీసులు అందజేశారు. కాగా కరోనా నుంచి బాధితులను కాపాడుతున్నందుకు… కొంతమంది తనపై కక్షసాధిస్తున్నారని పరుచూరి మల్లిక్ ఆరోపించారు. తను నివాసం ఉంటున్న ఇంటివద్దే నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా బాధితులకు సేవ చేస్తున్నందుకు తనను, తన వాలంటీర్లను ఫోన్ల ద్వారా భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే వాట్సాప్.. టెలిగ్రామ్ బ్లాక్​ చేశారని ఆరోపించారు.  మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో వంటింటి వైద్యం ద్వారా ఎంతో మందికి ఆరోగ్య సూచనలు, సంప్రదాయ వైద్య పద్ధతులు తెలియజేస్తుంటే ఓర్వలేక వాట్సాప్ గ్రూపును బ్లాక్ చేశారన్నారు. వాట్సాప్‌ ద్వారా ఎంతో మంది సలహాలు, సూచనలు తీసుకుంటున్న సమయంలో ఇలా చేయటం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు.

కరోనా థర్డ్ వేవ్ అత్యంత ప్రమాదకరమంటూ, అది పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని మల్లిక్ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో అన్నారు. వ్యాక్సిన్స్ పని చేయబోవని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆరోగ్య నిపుణుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది.

Also Read: హీరోయిన్‌ మెహ్రీన్‌ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నట్లు వెల్లడి

 స్నేహితుడికి షాక్ కొట్టడంతో ట్రాక్టర్‌పై నుంచి దూకి వెళ్లి అతడిని కాపాడాడు.. కానీ