Pawan Kalyan- Venu Swamy: అందుకే పవన్ కల్యాణ్ కు అలా జరుగుతోంది.. వేణు స్వామి కామెంట్స్ వైరల్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మళ్లీ మాట తప్పారు. సెలబ్రిటీల జాతకాల చెప్పనని గతంలో ప్రామిస్ చేసిన ఆయన మళ్లీ ఇప్పుడు ప్రముఖల జాతకాలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కొందరు టాలీవుడ్ ప్రముఖులపై వేణు స్వామి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

కొందరు టాలీవుడ్ ప్రముఖుల గురించి ఇటీవల జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత , టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ పై సినీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేణు స్వామిని ట్రోల్ చేస్తున్నారు. అయినా కూడా ఈ జ్యోతిష్యుడు ఆగడం లేదు. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. సెలబ్రిటీల జాతకాలంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నాడు. పైగా జ్యోతిష్య శాస్త్రంలో ఉంది కాబట్టి తాను చెప్పింది తప్పకుండా జరుగుతుందంటున్నారు. తను ఊహించి చెప్పిన విషయాలన్నీ ఏమాత్రం పొల్లుపోకుండా జరిగాయంటూ గతంలో జరిగిన కొన్ని సంఘటలను గుర్తు చేస్తున్నాడు. తాజాగా వేణు స్వామి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో పలు సార్లు పవన్ కల్యాణ్ పై నెగెటివ్ కామెంట్స్ చేసిన ఆయన ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ టోన్ తో మాట్లాడాడు.
‘పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనాలకు భగవంతుడి మీద అవగాహన కల్పిస్తున్నారు. వారాహి అమ్మవారిని జనాలకు పరిచయం చేసింది పవన్ కళ్యాణే. అంతేకాదు ఆయన తన వాహనం పేరు కూడా వారాహి అని పెట్టుకుని అమ్మవారిని ఇష్టం గా ఆరాదిస్తున్నారు. పవన్ కల్యాణ్ చేస్తున్నది మంచి పనులే. మాలాంటి వాళ్లు చెప్తే ఓ 10 మంది, 20 మంది చూస్తారు. కానీ పవన్ కల్యాణ్ చెప్తే లక్షల మంది ఆయనను ఫాలో అవుతారు’.
వేణు స్వామి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
‘పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారిని అంతగా పూజించారు. కాబట్టే ఆయనకు అదృష్టం అలా కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఏది పట్టుకున్న సరే మంచే జరుగుతుంది. ఆయనకు తిరుగు లేదు.. ఓటమి లేదు’ అని పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు వేణు స్వామి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతన్నాయి. వీటిని చూసిన మెగా ఫాన్స్ వేణు స్వామి పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
ఈ ఏడాది ఎవరికీ బాగుంటుందటే?.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.