F3 movie : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్. తాజాగా ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు చిత్రయూనిట్.
ఈ మేరకు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఓ బస్సులో ఎఫ్3 టీమ్ అంత ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకి..మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది! వస్తే, కొద్దిగా ముందుకి..వెళ్ళినా కొద్దిగా వెనక్కి థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా! అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. కరోనా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి తీసుకురావడంలేదు అని ప్రకటించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!😉
వస్తే, కొద్దిగా ముందుకి వెళ్ళినా కొద్దిగా వెనక్కి😀
థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!😎#F3Movie @VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @Mee_Sunil @ThisIsDSP @SVC_official @f3_movie#F3OnApril28th pic.twitter.com/HsR7nYlsVP
— Anil Ravipudi (@AnilRavipudi) January 29, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :