Allu Arjun: పుష్ప క్రేజ్ తగ్గదే లే.. బాలీవుడ్ లో రీమేక్ కానున్న బన్నీ మరో సినిమా..
ఒక ఒక్క సినిమాతో అన్నీ భాషల్లో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది

Allu Arjun: ఒక ఒక్క సినిమాతో అన్నీ భాషల్లో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్ గా మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. అదే రేంజ్ లో వసూళ్లను కూడా రాబట్టింది. బన్నీ నటించిన సినిమాలు గతంలో మలయాళం, హిందీ భాషల్లో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురం లో సినిమా దగ్గర నుంచి బన్నీకి బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. పుష్ప తో అదికాస్తా రెట్టింపు అయ్యింది. దాంతో ఇప్పుడు బన్నీ సినిమాల కోసం ఎక్కడి ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అల వైకుంఠపురం సినిమా త్వరలోనే అక్కడ రీమేక్ అవ్వనున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు మరి సినిమా కూడా బాలీవుడ్ లో రీమేక్ అవ్వడనికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా డీజే(దువ్వాడ జగన్నాధం). 2017లో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారని తెలుస్తుంది. డీజే సినిమాను తెరకెక్కించిన హరీశ్ శంకర్ – దిల్ రాజు హిందీ రీమేక్ ను కూడా కలిసే చేయనున్నారట. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్.
మరిన్ని ఇక్కడ చదవండి :




