Major: అడవి శేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..? మేజర్ రిలీజ్ పై సస్పెన్స్..

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు యంగ్ హీరో అడవి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శేష్

Major: అడవి శేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..? మేజర్ రిలీజ్ పై సస్పెన్స్..
Major
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 29, 2022 | 5:30 PM

Major: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు యంగ్ హీరో అడవి శేష్(Adivi Sesh). క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శేష్.. ఇప్పుడు మేజర్(Major) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకింగ్ తో జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో ‘మేజర్’ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ‘మేజర్’ టీజ‌ర్‌కి విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా ‘మేజర్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala), సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం, ఈ చిత్రం హిందీ, తెలుగు, మలయాళంలో విడుదల కానుంది. మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ ఏప్లస్ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ మేరకు చిత్రాయునిట్ ప్రకటన కూడా చేశారు.

పరిస్థితులు చెక్కబడిన తర్వాత సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. మేజర్ సినిమా ఇండియా కోసం చేసిన సినిమా కాబట్టి దేశం లో పరిస్థితులు మెరుగైన తర్వాత విడుదల చేస్తామని తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించ లేదు. ఆర్ ఆర్ ఆర్ రాధేశ్యామ్ భీమ్లా నాయక్ చిత్రాలు మార్చి లేదా ఏప్రిల్ లో థియేటర్లలోకి రావడానికి ఆసక్తిని చూపిస్తుంటే `మేజర్` మేకర్స్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఈ సమ్మర్ కు భారీ సినిమాలన్నీ వరుసగా విడుదల కానున్నాయి. కాబట్టి ఇప్పట్లో మేజర్ సినిమాను తీసుకురాకపోవొచ్చు అనే టాక్ వినిపిస్తుంది. అందుకనే తొందర పడి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం లేదని అంటున్నారు విశ్లేషకులు. బడా సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత తీరికగా సినిమాను రిలీజ్ చేస్తారని అంటున్నారు. మే లోనే మేజర్ కు మోక్షం అంటున్నారు.  చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: బ్లడ్ క్యాన్సర్‏తో పోరాడుతున్న ఆర్టిస్ట్.. ఆదుకోవాలంటూ డైరెక్టర్ రాజమౌళి విజ్ఞప్తి..

Best Buddies: నాటి చిన్న నాటి స్నేహితులు.. క్లాస్ మేట్స్.. నేడు సెలబ్రేటీలు.. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా

Megastar Chiranjeevi: క్వారంటైన్‏లో ఉన్నాను అందుకే నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాను.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే