Raviteja: మాస్ రాజా సినిమాలో కీలక పాత్రలో ఆ హీరోయిన్.. చాలా కాలం తర్వాత వెండితెర పైకి..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ రవితేజ. ఇప్పటికే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Raviteja: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ రవితేజ. ఇప్పటికే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫిబ్రవరి 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. రమేష్ వార్మ దర్శకత్వం ఆవహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేశాడు. వాటిలో క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ మూవీ కూడా ఒకటి. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సూపర్ క్రేజీ మూవీ రావణాసుర. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.అలాగే రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు శరత్ మాండవ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
వీటితోపాటే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు. స్టువర్ట్ పురం దొంగల ముఠాలో కీలక సభ్యుడైన నాగేశ్వరరావు జీవిత కథతో తెరకెక్కుతోన్న ‘టైగర్ నాగేశ్వర రావు’ అనే చిత్రంలో ఆయన నటించనున్నారు. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.టైగర్ నాగేశ్వరరావు విషయానికొస్తే..1970వ దశకంలో ఈ గజదొంగ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్లే చిక్కి పోలీసుల కళ్లు గప్పి చాకచక్యంగా తప్పించుకునేవాడు. 1987లో పోలీసులు నాగేశ్వరరావును మట్టుబెట్టారు. ఇప్పుడు ఇదే కథతో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు – అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు. అయితే ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం రేణుదేశాయ్ ని సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కథ నచ్చడంతో ఈ సినిమాలో పాత్ర చేయడానికి రేణుదేశాయ్ ఒప్పుకున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :