Jr NTR : ఎన్టీఆర్ కొరటాల సినిమానుంచి రెండు భారీ ఆప్డేట్స్ రానున్నాయి.. అభిమానులకు పండగే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్(RRR ) సినిమాలో నటించిన విషయం తెలిసిందే. రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమా తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు , ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ కూడా వాయిదా పడుతుంది. జనవరి 7న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయ్యింది. మార్చ్ లోకానీ ఏప్రిల్ లో కానీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాలతో ఓ సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఆచార్య సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ప్రస్తుతం ఆచార్య చివరి దశకు చేరుకోవడం, ఎన్టీఆర్ కూడా ఖాళీగా ఉండడంతో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై అడుగులు ముందుకు పడ్డాయి. దీంతో ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు తన కొత్త సినిమాను ప్రారంభించే పనిలో పడ్డారంటా ఎన్టీఆర్. ఇటు కొరటాల శివ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులను ప్రారంభించారని సమాచారం. వచ్చే నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్న కొరటాల ఆ దిశగా ఇప్పిటికే అడుగులు వేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ముద్దుగుమ్మ ఆలియా భట్ హీరోయిన్ గా నటించబోతుంది.ఇక సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడి పేరును కూడా అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. సినిమా కోసం అనిరుధ్ రవిచంద్రన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగిందట. ఇప్పుడు హీరోయిన్ , సంగీత దర్శకుడి పేర్లను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారట. ఫిబ్రవరి నెలలో అధికారికంగా వెళ్లడించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ 30 కి సంబంధించిన కొత్త అప్డేట్స్ అధికారికంగా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ఇప్పుడు కొరటాల సినిమా కూడా పాన్ ఇండియా మూవీనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :