Varun Tej: కోహ్లీలో నచ్చే విషయం అదే.. విరాట్ పై వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్..
సచిన్ 49 సెంచరీలతో టాప్ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత కోహ్లీ నిలిచాడు. కేవలం మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును సమానం చేస్తాడు. అయితే సచిన్ అత్యధిక వన్డే సెంచరీ రికార్డును సమానం చేయడం.. లేదా అధిగమించడం కోహ్లీ కచ్చితంగా చేస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కోహ్లీకి వరుణ్ సైతం వీరాభిమాని. ముఖ్యంగా కోహ్లీలోని అగ్రెషన్ అంటూ చాలా ఇష్టం. అంతేకాకుండా కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023లో టీమిండియా ఫుల్ ఫాంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచులు గెలిచి టాప్ స్థానంలో ఉంది ఇండియా. ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు ఎక్కువగా విరాట్ కోహ్లీ గురించి ఆలోచిస్తున్నారు. వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకు 48 సెంచరీలు చేశాడు. సచిన్ 49 సెంచరీలతో టాప్ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత కోహ్లీ నిలిచాడు. కేవలం మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును సమానం చేస్తాడు. అయితే సచిన్ అత్యధిక వన్డే సెంచరీ రికార్డును సమానం చేయడం.. లేదా అధిగమించడం కోహ్లీ కచ్చితంగా చేస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కోహ్లీకి వరుణ్ సైతం వీరాభిమాని. ముఖ్యంగా కోహ్లీలోని అగ్రెషన్ అంటూ చాలా ఇష్టం. అంతేకాకుండా కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కు తెలుగు కామెంట్రీలో వరుణ్ తేజ్ పాల్గొన్నాడు. మిగత కామెంటేటర్లతో కలిసి సరదాగా అలరించాడు. ఈ సందర్భంగా విరాట్ గురించి మాట్లాడుతూ.. కోహ్లీలో తనకు అగ్రెషన్ అంటే ఇష్టమన్నారు. “నేను మాత్రమే కాదు ప్రతి భారతీయుడు.. క్రికెట్ ప్రేమికుడు. సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీ రికార్డును బ్రేక్ చేసే మార్గంలోనే కోహ్లీ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అతను రికార్డును సమం చేయబోతున్నాడని.. లేదా ఆ రికార్డ్ అధిగమిస్తాడని నేను వంద శాతం ఖచ్చితంగా అనుకుంటున్నాను. టిమిండియా జట్టును నడిపించడంలో కోహ్లీ ముందుంటాడు. అలాంటి వ్యక్తి టీంలో ఉండడం ఖచ్చితంగా మొత్తం జట్టుకు, ముఖ్యంగా యువకులకు, అందరికీ పెద్ద బలం. విరాట్, రోహిత్ ఇద్దరూ రాబోయే తరాలకు స్పూర్తి. అలాంటి అనుభవజ్ఞులైన క్రికెటర్లతో ఆడటం చాలా బాగుంది.ఇది అద్భుతమైన విషయం అని నేను భావిస్తున్నాను. ఇప్పటివరకు టీమిండియా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. బ్యాట్స్‌మెన్, బౌలర్లు, అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. గతంలో ప్రపంచ కప్ మమ్మల్ని నిరాశ పరిచింది. కానీ ఈసారి అలాంటిజది జరగదని భావిస్తున్నారు. ఈసారి ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్.
👑 @imVkohli – పేరు వినబడితే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయ్ 🤩
మరి #KingKohli లో 🏏 @IAmVarunTej కి నచ్చిన అంశం ఏంటో చూసేయండి 😍
చూడండి | ICC Men’s Cricket World Cup #INDvENG | Oct 29 | 12:30 PM నుండి మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#ViratKohli pic.twitter.com/ce1ABrFNEn
— StarSportsTelugu (@StarSportsTel) October 25, 2023
మెగా హీరో వరుణ్ తేజ్ మరికొన్ని గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ వివాహం రేపు (నవంబర్ 1న) ఇటలీలోని టస్కానీలో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి వేడుకలు ఇప్పటికే షూరు అయ్యాయి. అక్టోబర్ 30న కాక్ టైల్ పార్టీ జరగ్గా.. ఈరోజు మెహందీ వేడుకలు, సంగీత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.