- Telugu News Photo Gallery Cinema photos Varun Tej and Lavanya Tripathi Haldi Ceremony Photos Goes Viral In Social Media telugu cinema news
Varun Tej-Lavanya Tripathi: వేడుకగా వరుణ్ తేజ్, లావణ్య హల్దీ ఫంక్షన్.. వైరలవుతున్న ఫోటోస్..
మరికొన్ని గంటల్లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి పెళ్లి వేడుకలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. సోమవారం కాక్ టైల్ పార్టీలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మంగళవారం హల్దీ వేడుకలు జరిగాయి. పసుపు వర్ణం దుస్తుల్లో లావణ్య, వరుణ్ తేజ్ మెరిసిపోయారు. లావణ్య పసుపు కలర్ లెహంగా ధరించగా.. వరుణ్ పసుపు రంగు కుర్తా, తెలుపు ప్యాంట్ ధరించారు. ఈ హల్దీ వేడుకకు థీమ్ ను పసుపు, తెలుపు రంగుల్లో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Oct 31, 2023 | 9:19 PM

మరికొన్ని గంటల్లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి పెళ్లి వేడుకలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. సోమవారం కాక్ టైల్ పార్టీలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఇక మంగళవారం హల్దీ వేడుకలు జరిగాయి. పసుపు వర్ణం దుస్తుల్లో లావణ్య, వరుణ్ తేజ్ మెరిసిపోయారు. లావణ్య పసుపు కలర్ లెహంగా ధరించగా.. వరుణ్ పసుపు రంగు కుర్తా, తెలుపు ప్యాంట్ ధరించారు. ఈ హల్దీ వేడుకకు థీమ్ ను పసుపు, తెలుపు రంగుల్లో డిజైన్ చేశారు.

ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వీరిద్దరు వీరిద్దరూ కూడా పసుపు వర్ణంలోనే దుస్తులను ధరించారు.

నవంబర్ 1న బుధవారం మధ్యాహ్నం వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఇరువురి కుటుంబసభ్యులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు ఇటలీ చేరుకున్నారు.

ఇక ఈరోజు మరికొంత మంది సెలబ్రెటీలు, వరుణ్, లావణ్య స్నేహితులు ఇటలీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సమంత, చైతన్యతోపాటు పలువురు సెలబ్రెటీలు వరుణ్, లావణ్య పెళ్లికి హాజరుకానున్నారు.





























