Varun Tej-Lavanya Tripathi: హైదరాబాద్ చేరుకున్న కొత్త జంట.. ఎయిర్‏పోర్టులో స్వాగతం పలికిన అభిమానులు..

దాదాపు మూడు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకలలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, నితిన్ తమ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే మెగా, అల్లు కుటుంబసభ్యులు, సన్నిహితులు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నితిన్ హైదరాబాద్ చేరుకున్నారు.

Varun Tej-Lavanya Tripathi: హైదరాబాద్ చేరుకున్న కొత్త జంట.. ఎయిర్‏పోర్టులో స్వాగతం పలికిన అభిమానులు..
Varun Tej, Lavanya Tripathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 04, 2023 | 4:34 PM

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకలలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, నితిన్ తమ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే మెగా, అల్లు కుటుంబసభ్యులు, సన్నిహితులు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నితిన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇక శుక్రవారం రామ్ చరణ్ ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో వచ్చేశారు.

ఇక ఈరోజు కొత్త జంట హైదరాబాద్ చేరుకున్నారు. పెళ్లి వేడుకల అనంతరం తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన నూతన వధూవరులకు విమానాశ్రయంలో పూలతో స్వాగతం పలికారు ఫ్యాన్స్.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో వరుణ్ తేజ్ నీలిరంగు టీ-షర్ట్, బ్రౌన్ బాంబర్ జాకెట్ ధరించి, స్టైలిష్ బ్లాక్ సన్ గ్లాసెస్‌తో జత చేశాడు. ఇక లావణ్య పసుపు సల్వార్ సూట్‌లో అందంగా కనిపించింది.

అక్టోబర్ 30న టుస్కానీలో కాక్‌టెయిల్ పార్టీతో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత హల్దీ, మెహందీ ఫంక్షన్స్ జరిగాయి. నవంబర్ 1న వీరి వివాహం జరగ్గా.. ఈనెల 5న టాలీవుడ్ స్నేహితులు, సన్నిహితుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత లావణ్య స్వస్థలం డెహ్రాడూన్‌లో రెండోసారి రిసెప్షన్ నిర్వహించబడుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.