సన్నజాజి తీగ లాంటి నడుము అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేదిక
Phani CH
02 January 2025
ముద్దుగుమ్మ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది చిన్నది.
ముని సినిమా తరువాత విజయదశమి, బాణం సినిమాలతో తెలుగువారికి సుపరిచితమే. ఇందులో బాణం సినిమా అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టింది.
అయితే తరువాత వేదికకు మాత్రం అవకాశాలు రాలేదు అప్పుడప్పుడు తెలుగులో కనిపించిన ఆమె .. కోలీవుడ్, మాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.
ఇక ఈ మధ్యకాలంలో వేదిక ఒక్క తెలుగు సినిమాలో కనిపించింది లేదు. అయితేనేం అమ్మడి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
అయితే తాజాగా బాహుబలి మేకర్లైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా అధినేత ప్రసాద్ దేవినేని నిర్మించిన ప్రాజెక్ట్ ‘యక్షిణి’తో ఏకంగా పాన్ ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఇక ఈ సిరీస్ ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌తో మరోసారి వేదిక తన నట విశ్వరూపాన్ని చూపించారని చెప్పొచ్చు.
ఇది ఇలా ఉంటే వేదిక తాజాగా చీరకట్టులో దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.