Actress: న్యూ ఇయర్ పార్టీలో ఫుల్లుగా తాగేసిన ప్రముఖ హీరోయిన్.. కనీసం నడవలేని స్థితిలో.. వీడియో వైరల్
చూస్తుండగానే మరో సంవత్సరం ముగిసిపోయింది. ఎన్నో కొంగొత్త ఆశలతో నూతన ఏడాదికి ప్రపంచమంతా సాదర స్వాగతం పలికింది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు ఎంతో వేడుకగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పార్టీలు, పబుల్లో ఎంజాయ్ చేశారు. విందులు, వినోదాల్లో మునిగి తేలారు.
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సినీ తారలంతా కొత్త ఏడాది గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. ఇక బాలీవుడ్ తారలు కూడా విందులు, వినోదాల్లో మునిగి తేలుతూ న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్, నాగిన్ ఫేమ్ మౌనిరాయ్ కూడా ఒక న్యూఇయర్ పార్టీకి హాజరైంది. తన భర్తతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ క్రమంలోనే మౌనిరాయ్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. అందులో నాగిన్ బ్యూటీ ఫుల్ గా మద్యం సేవించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు నడవలేని స్థితిలో ఉన్న ఆమె భర్త సాయంతో కారు దగ్గరుకు చేరుకుంది. మధ్యలో తూగుతూ కింద కూడా పడిపోయింది. దీంతో మౌనిరాయ్ ను ఆమె భర్తనే స్వయంగా కారులో ఇంటికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా తమను ఎవరు ఫొటోలు తీయవద్దంటూ అందరికీ విజ్ఞప్తి చేశాడు మౌని రాయ్ భర్త. అలాగే కెమెరాలకు తన చేతిని కూడా అడ్డు పెట్టడం ఈ వీడియోలో కనిపించింది. వీరి వెంట ప్రభాస్ కల్కి సినిమా హీరోయిన్ దిశా పటానీ కూడా ఈ వీడియోలో కనిపించింది. ఓ నెటిజన్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది కాస్తా తెగ వైరలవుతోంది.
న్యూ ఇయర్ పార్టీ తర్వాత బయటకు వస్తోన్న నటి మౌనిరాయ్, పక్కన కల్కి హీరోయిన్ దిశా పటానీ.. వీడియో
View this post on Instagram
మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో బాగా ఫేమస్ అయింది. దీంతో పాటు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. కేజీఎఫ్ పార్ట్ 1 సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. అలాగే రణ్ బీర్ కపూర్, అలియా భట్ సినిమ బ్రహ్మాస్త్రలో విలన్ గానూ మెప్పించింది.
మౌనిరాయ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
భర్తతో రొమాంటిక్ గా మౌనిరాయ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.