తండ్రితో కలిసి నాగ్ కనిపించిన చిత్రాలు..

04 January 2025

Battula Prudvi

ఏఎన్ఆర్, నాగార్జున ఇద్దరు కొన్ని చిత్రాల్లో కలిసి నటించారు. ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదటిగా అక్కినేని నాగేశ్వరరావు సుడిగుండాలు చిత్రంలో నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా అతిధి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అయితే నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన తొలి సినిమా మాత్రం కలెక్టర్ గారి అబ్బాయి. బి.గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం అగ్ని పుత్రుడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు  డైరెక్ట్ చేసిన చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది.

నాగార్జున, ఏఎన్ఆర్ కలిసి నటించిన మూడో చిత్రం రావుగారిల్లు. తరణి రావు దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

నాగేశ్వరరావు, నాగార్జున కలిసి కనిపించిన నాలుగో మూవీ ఇధ్దరూ ఇద్దరే. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మరోసారి కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించిన భక్తిరస చిత్రం శ్రీరామదాసు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించింది.

ఏఎన్ఆర్ ఆయన తనయుడు నాగార్జునతో నటించిన చివరి సినిమా మనం. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటించగా.. అఖిల్ గెస్ట్ రోల్లో ఆకట్టుకున్నారు.