- Telugu News Photo Gallery Cinema photos Tollywood Young Hero Adivi Sesh fall in love News Goes Viral In Social media Telugu Heros Photos
Adivi Sesh: అడివి శేష్ ప్రేమలో పడ్డారా.? అన్నపూర్ణ స్టూడియోస్‌లో లవ్ స్టోరీపై క్లారిటీ.
అడివి శేష్ ప్రేమలో పడ్డారా..? ఇన్నాళ్లకు ఈయన వయసు గుర్తుకొచ్చిందా..? ఎర్లీ 30స్‌లో ఉన్నా.. లేట్ 40స్ మాదిరి ఎక్కువగా సీరియస్ సినిమాలు చేస్తుంటారు అడివి శేష్. కానీ ఎంతైనా కుర్రాడే కదా అందుకే ప్రేమ పురుగు కుట్టేసిందంటున్నారు. మరి అడివి శేష్ నిజంగానే లవ్‌లో పడిపోయారా.. అసలేంటి ఈ ప్రేమ్ కహానీ..? ఈయన ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు..? రొటీన్ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు కానీ...
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Nov 04, 2023 | 3:33 PM

అడివి శేష్ ప్రేమలో పడ్డారా..? ఇన్నాళ్లకు ఈయన వయసు గుర్తుకొచ్చిందా..? ఎర్లీ 30స్‌లో ఉన్నా.. లేట్ 40స్ మాదిరి ఎక్కువగా సీరియస్ సినిమాలు చేస్తుంటారు అడివి శేష్. కానీ ఎంతైనా కుర్రాడే కదా అందుకే ప్రేమ పురుగు కుట్టేసిందంటున్నారు.

మరి అడివి శేష్ నిజంగానే లవ్‌లో పడిపోయారా.. అసలేంటి ఈ ప్రేమ్ కహానీ..? ఈయన ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు..? రొటీన్ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు కానీ కొత్తగా ప్రయత్నించడానికి తక్కువ మంది నటులే ఉన్నారనేది అడివి శేష్ పంథా.

అందుకే మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. క్షణం, ఎవరు, గూడఛారి, హిట్ 2, మేజర్ ఇలా వరసగా సాగిపోతుంది శేష్ దండయాత్ర. అయితే ఇన్నాళ్లకు ఈయనకు వయసు గుర్తొచ్చి లవ్ స్టోరీ వైపు అడుగులేస్తున్నారు.

తన ప్రతీ సినిమా థీమ్ యాక్షన్ అయినా.. అక్కడక్కడా లవ్ స్టోరీస్ ఎలివేట్ చేస్తుంటారు శేష్. కానీ మెయిన్ థీమ్ ముందు ఆ లవ్ అస్సలు కనిపించదు. మేజర్, హిట్ 2 లాంటి సినిమాల్లో ప్రేమకథలు బాగానే హైలైట్ అయ్యాయి.

కానీ ఈయన పూర్తిస్థాయి లవ్ స్టోరీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది జరిగేలా ఉందిప్పుడు. ఈ మధ్యే శేష్ ఓ ప్రేమకథకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. హిట్ 2 తర్వాత చిన్న బ్రేక తీసుకున్న శేష్.. గూడఛారి 2తో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే ఈ చిత్ర వర్క్ జరుగుతుంది. పాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తీసుకొస్తున్నారు శేష్ అండ్ టీం. దాంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ లవ్ స్టోరీని నవంబర్‌లోనే మొదలు పెట్టనున్నారీయన.

ఇటు గూడఛారి 2, అటు రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. రెండూ ఒకేసారి షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు శేష్‌కు తన వయసు గుర్తుకొచ్చిందన్నమాట.





























