Virat Kohli: క్యా సీన్​ హే..అప్పుడేమో ఫైటింగ్.. ఇప్పుడేమో మీటింగ్..!

Virat Kohli: నాలుగో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆసీస్ ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, టిమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సామ్ కాన్‌స్టాస్ విరాట్‌ను కలిసి ఫోటో దిగాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకలుగా స్సందిస్తున్నారు. విరాట్‌పైనే చేయి వేస్తావా అంటూ కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Virat Kohli: క్యా సీన్​ హే..అప్పుడేమో ఫైటింగ్.. ఇప్పుడేమో మీటింగ్..!
Virat Kohli With Sam Konsta
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Jan 02, 2025 | 4:33 PM

ఇటీవలే ఆసీస్‌లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆసీస్ ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, టిమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా కోహ్లీపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోహ్తీ ఒక్క డీమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్‌లో ఫీజులో 20%  కోత విధించింది. అయితే ఈ ఘటనపై సామ్ కాన్‌స్టాస్ సానుకూలంగానే స్పందించాడు. మ్యాచ్ జరిగే సమయంలో విరాట్ తను భావోద్వేగానికి గురయ్యామని తెలిపాడు. తనకు విరాట్ వీర అభిమానని కూడా చెప్పాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విరాట్ కోహ్లీని సామ్ కాన్‌స్టాస్ కలిశాడు. ఈ సందర్భంగా వారిద్దరి కాసేపు మాట్లాకున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆ ఫోటోలో కోహ్లీపై సామ్ కాన్‌స్టాస్ చేతి వేసి నవ్వుతూ ఉన్నారు.

మెల్‌బోర్న్‌ టెస్టులో ఓడిన భారత జట్టు సిరీస్‌లో 1-2తో వెనుకబడింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఫైనల్ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగనుంది. ఈ  చివరి నిర్ణయాత్మక మ్యాచ్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పిచ్ దాదాపు సిద్ధమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ) పిచ్ గూర్చి ఒక్కసారి చూస్తే..సిడ్నీ పిచ్ ఆస్ట్రేలియాలో బ్యాటర్లకు అనుకూలిస్తుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. SCG పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉంటుందని, ఇందులో బౌలర్లకు అంతగా సహకరించదని ఒక్క వాదన ఉంది. ఈ పిచ్‌లో బ్యాటర్లు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గతంలో సిడ్నీ మైదానంలో జరిగిన టెస్టులో టీమిండియా ప్రదర్శన నిరాశపరిచింది. ఈ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 13 మ్యాచ్‌లు జరిగాయి. 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌లు గెలిచింది, అయితే భారతదేశం సిడ్నీ మైదానంలో ఒకే ఒక టెస్టులో గెలిచింది. అది కూడా 47 సంవత్సరాల క్రితం 1978 సంవత్సరంలో..  2012లో భారత్‌కు చివరి ఓటమి ఎదురైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఆటతీరు బాగాలేదు. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గబ్బాలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. కాగా, మెల్‌బోర్న్‌లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి