AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: న్యాయపోరాటంలో కాంతారా విజయం.. వరాహ రూపం ఒరిజినల్‌ సాంగ్‌ వచ్చేస్తోంది

యూట్యూబ్‌తో సహా ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ అనుమతి లేకుండా ఉపయోగించరాదని కేరళ కోర్టు ఆంక్షలు విధించింది. దీనికి తలొగ్గిన చిత్రబృందం.. ‘వరాహ రూపం’ పాటను సినిమా థియేటర్లు, హోంబలే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్, సావన్ లాంటి మ్యూజిక్ యాప్స్ నుంచి తొలగించింది

Kantara: న్యాయపోరాటంలో కాంతారా విజయం.. వరాహ రూపం ఒరిజినల్‌ సాంగ్‌ వచ్చేస్తోంది
Kantara Movie
Basha Shek
|

Updated on: Dec 03, 2022 | 5:54 PM

Share

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతారా చిత్రం దేశవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక ఇందులోని వరాహరూపం పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కానీ ఈ పాటను కాపీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేరళ కోర్టు ఈ పాటను ప్రసారం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్‌తో సహా ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ అనుమతి లేకుండా ఉపయోగించరాదని కేరళ కోర్టు ఆంక్షలు విధించింది. దీనికి తలొగ్గిన చిత్రబృందం.. ‘వరాహ రూపం’ పాటను సినిమా థియేటర్లు, హోంబలే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్, సావన్ లాంటి మ్యూజిక్ యాప్స్ నుంచి తొలగించింది.. ఇటీవల ఓటీటీలో విడుదలైన కాంతార సినిమాలో వరాహరూపం పాట ట్యూన్‌ను మార్చి యాడ్‌ చేశారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాట అసలు బాగోలేదని చాలామంది పెదవివిరిచారు. అయితే ఇప్పుడు వరాహ రూపం ఒరిజినల్‌ పాట అందుబాటులోకి రానుంది. న్యాయ పోరాటంలో కాంతార చిత్రం విజయం సాధించింది.

కాంతారా చిత్రంలోని వరాహ రూపం పాటపై స్టే ఆర్డర్‌ను కేరళ కోర్టు ఎత్తివేసింది. దీంతో త్వరలోనే కాంతారా ప్రదర్శితమవుతోన్న సినిమాహాళ్లు, ఓటీటీ, యూట్యూబ్‌తో సహా ప్రతిచోటా ఈ పాట అందుబాటులోకి రానుంది. దీనిపై రిషబ్‌ శెట్టి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘దేవతల ఆశీస్సులు, ప్రజల ప్రేమతో వరాహరూపం కేసులో విజయం సాధించాం. ప్రజల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో పాటను మార్చబోతున్నాం’ అని ట్విట్టర్లో తెలిపాడు రిషభ్‌. కాంతారా చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కుమార్ కిర్గందూర్ నిర్మించారు. సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చారు. అరవింద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..