AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సంక్రాంతికి బాక్సాఫీస్‏ను షేక్ చేయనున్న క్రేజీ ప్రాజెక్టులు.. బరిలో బాలయ్య.. చిరు.. విజయ్..

తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. మరి పండక్కి ఎవరు ముందొస్తున్నారు..? సంక్రాంతి సెగలు 2 నెలల ముందు నుంచే మొదలయ్యాయి. ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలు బరిలోకి దిగబోతుండటంతో.. పండగపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. కనీసం 300 కోట్ల బిజినెస్ కళ్ల ముందు

Tollywood: సంక్రాంతికి బాక్సాఫీస్‏ను షేక్ చేయనున్న క్రేజీ ప్రాజెక్టులు.. బరిలో బాలయ్య.. చిరు.. విజయ్..
Tollywood
Rajitha Chanti
|

Updated on: Dec 03, 2022 | 5:32 PM

Share

సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి.. అన్నింటి బిజినెస్ 100 కోట్లకు పైగానే జరుగుతుంది.. అంతా బాగానే ఉంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్స్ ఏంటి..? వీరత్వం చూపించడానికి బాలయ్య ఎప్పుడొస్తున్నారు.. మాస్ జాతర చేయడానికి చిరు వచ్చేదెప్పుడు..? ఈ ఇద్దరి వీరుల మధ్య వారసుడికి ఛాన్స్ ఎప్పుడిస్తారు..? తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. మరి పండక్కి ఎవరు ముందొస్తున్నారు..? సంక్రాంతి సెగలు 2 నెలల ముందు నుంచే మొదలయ్యాయి. ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలు బరిలోకి దిగబోతుండటంతో.. పండగపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. కనీసం 300 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. దాంతో అటు బయ్యర్లకు.. ఇటు నిర్మాతలకు ఇద్దరికి కంగారు తప్పడం లేదు. పైగా చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్సే కావడం ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం.

వారసుడు డబ్బింగ్ సినిమా అయినా.. దాని వెనక దిల్ రాజు ఉండటంతో థియేటర్స్ కొరత ఉండదు. మూడు సినిమాలు వస్తున్నాయి సరే.. ఇందులో ఏది ముందొస్తుంది.. ఏది తర్వాత వస్తుందనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ పండక్కి చిరంజీవి కంటే ముందు బాలయ్యే వస్తున్నారు. వీరసింహారెడ్డికి జనవరి 12నే ముహూర్తం ఖరారు చేసారు నటసింహం. అదే రోజు విజయ్ వారసుడు కూడా థియేటర్స్‌లోకి రాబోతుంది.

జనవరి 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. ఏరికోరి మరీ చిరు ఈ డేట్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే జనవరి 13 శుక్రవారం.. ఆ తర్వాత రెండు రోజుల వీకెండ్‌తో పాటు సంక్రాంతి సెలవులున్నాయి. పైగా వాల్తేరు వీరయ్య పక్కా మాస్ సినిమా.. దాంతో సంక్రాంతికి జాతర జరిపించాలని ఫిక్సయ్యారు మెగాస్టార్. మొత్తానికి 12న బాలయ్య, విజయ్.. 13న చిరంజీవి రాకతో సంక్రాంతి కలర్ ఫుల్ కాబోతుంది.