AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘హిట్ 3’లో నటిస్తావా సామ్ ?.. అడివి శేష్ ప్రశ్నకు సమంత రిప్లై అదిరిపోయింది..

హిట్ 3లో సమంత్ లీడ్ రోల్‏లో యాక్ట్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు. ఇందుకు అడివి శేష్ స్పందిస్తూ.. ఇది అద్భుతమైన ఆలోచన.. నువ్వేమంటావు సామ్ ? అంటూ సమంతను ట్యాగ్ చేశాడు.

Samantha: 'హిట్ 3'లో నటిస్తావా సామ్ ?.. అడివి శేష్ ప్రశ్నకు సమంత రిప్లై అదిరిపోయింది..
Adivi Sesh, Samantha
Rajitha Chanti
|

Updated on: Dec 03, 2022 | 6:23 PM

Share

వర్సటైల్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన హిట్ 2 సినిమా బ్లాక్ బస్టర్‏గా నిలిచింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందించిన ఈ సినిమాకు సిక్వెల్ రాబోతుందని క్లైమాక్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పటికే క్యూరియాసిటి నెలకొన్న హిట్ 3లో న్యాచురల్ స్టార్ నాని మెయిన్ రోల్ లో కనిపించనున్నారని.. అందులో ఓ పోలీస్ ఆఫీసర్ గా నాని కనిపించనున్నారని తెలిపారు. ఇక హిట్ ది ఫస్ట్ కేస్ అనంతరం శుక్రవారం విడుదలైన హిట్ 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో శేష్ నటనకు మరోసారి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా హిట్ సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించారు హీరో అడివి శేష్. అందులో ఓ నెటిజన్.. హిట్ 3లో సమంత్ లీడ్ రోల్‏లో యాక్ట్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు. ఇందుకు అడివి శేష్ స్పందిస్తూ.. ఇది అద్భుతమైన ఆలోచన.. నువ్వేమంటావు సామ్ ? అంటూ సమంతను ట్యాగ్ చేశాడు.

ఇక శేష్ ప్రశ్నకు సామ్ రియాక్ట్ అయ్యింది. ఇది వినడానికి చాలా సరదాగా ఉంది. మీరు సూపర్ హిట్ అందుకున్నందుకు చాలా శుభాకాంక్షలు. అంటూ రిప్లై ఇచ్చింది సామ్. అలాగే హిట్ 3లో నాని మాత్రమే కాకుండా అడివి శేష్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నారని సమాచరం. అంతేకాకుండా…తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం ఈ మూవీలో కనిపించనున్నారట.అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇటీవలే యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సామ్. ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటిస్తుంది. అయితే కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌