Adivi Sesh: ‘మహేష్ కాల్ చేసి ఆ మాట చెప్పగానే కన్నీళ్లు వచ్చేశాయి’.. అడివి శేష్ కామెంట్స్ వైరల్..

సస్పెన్స్ థ్రిల్లర్‏గా తెరకెక్కిన హిట్ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ నెటిజన్లతో ట్విట్టర్ చాట్ చేశారు. అందులో ఫాలోవర్ల్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Adivi Sesh: 'మహేష్ కాల్ చేసి ఆ మాట చెప్పగానే కన్నీళ్లు వచ్చేశాయి'.. అడివి శేష్ కామెంట్స్ వైరల్..
Mahesh Babu, Adivi Sesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2022 | 3:03 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం హిట్ 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి మరోసారి మెప్పించారు. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్షన్‌లో ఇంతకు ముందు రూపొంది ఘన విజయాన్ని సాధించిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ చిత్రానికి ఇది ఫ్రాంచైజీగా రూపొందింది. అడివి శేష్ ఇందులో కె.డి అనే పాత్రలో కనిపిస్తుంటే ఆయనకు జోడీగా ఆర్య అనే పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ భారీ రేంజ్‌లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. న్యాచురల్ స్టార్ నాని హిట్ యూనివర్స్‏ను నిర్మించగా.. త్వరలోనే హిట్ 3 కూడా రాబోతుందంటూ హింట్ ఇచ్చేశారు. ఇక మూడో భాగంలో నాని కథానాయికుడిగా కనిపించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‏గా తెరకెక్కిన హిట్ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ నెటిజన్లతో ట్విట్టర్ చాట్ చేశారు. అందులో ఫాలోవర్ల్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

హిట్ 2 విజయాన్ని నిన్న రాత్రి ఎలా ఎంజాయ్ చేశారు ?…

అడివి శేష్ స్పందిస్తూ.. నేను, నాని, విశ్వక్ సేన్, శైలేష్ కొలను కలిసి హిట్ వర్స్ కు సంబంధించిన తదుపరి కార్యాచరణ గురించి చర్చించుకున్నాం. అలాగే ఇతర చిత్రబృందంతో కలిసి డ్యాన్స్ చేశాం. మా డ్యాన్స్ చూసి మీనాక్షి నవ్వింది.

ఇవి కూడా చదవండి

హిట్ వర్స్ లో మహేష్ బాబుని హీరోగా పెట్టండి. సినిమా మరోస్థాయికి వెళ్తుంది.. ఆయనతో మీరొక థ్రిల్లింగ్ స్టోరీ చేస్తే చూడాలని ఉంది..

అడివి శేష్.. ఇది ఆయనకు సూట్ అవుతుందో లేదో ఆలోచించాలి. ఈరోజు ఉదయం ఆయన ఫోన్ చేసి నాతో చాలా సేపు మాట్లాడారు. నా విషయంలో గర్వంగా ఉన్నానని చెప్పారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఒక సోదరుడిగా ఎప్పటికీ తోడుగా ఉంటానని ఆయనకు మాటిచ్చాను. అలాగే ఆయనకు హిట్ 2 చూపించాలని ఆశగా ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

గూఢఛారి 2 ఎప్పుడు ?..

ప్రస్తుతం హిట్ 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలోనే హిందీ వెర్షన్ ప్రమో షన్స్ లో పా ల్గొనాలి. ఆ తర్వాతనే గూఢచారి -2.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!