Gurthunda Seethakalam: ఫీల్ గుడ్‏గా గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. మరీ అందంగా ఉందిరా..

టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి సంఘ‌ట‌నలు ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశ్యంతో తెరకెక్కిన చిత్రమే 'గుర్తుందా శీతాకాలం".

Gurthunda Seethakalam: ఫీల్ గుడ్‏గా గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. మరీ అందంగా ఉందిరా..
Gurthunda Seethakalam
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2022 | 2:28 PM

చాలామంది త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత, వెనక్కు తిరిగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి సంఘ‌ట‌నలు ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశ్యంతో తెరకెక్కిన చిత్రమే ‘గుర్తుందా శీతాకాలం”. చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది ల సమర్పణలో వేదాక్ష‌ర ఫిల్మ్స్ నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై టాలెంటెడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి, సుహ‌సిని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు, న‌టుడైన నాగ‌శేఖ‌ర్ ఈ సినిమాతో తెలుగుకి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబులు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

గాడ్ ఫాదర్ సినిమాలో సీరియస్ లుక్ లో కనిపించిన సత్యదేవ్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో యంగ్ లుక్స్ లో కనిపించి మంచి ఎనర్టిటిక్ పర్పామెన్స్ ని కనబరిచాడు. ప్రేమలో ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ లవరే ప్రాబ్లమ్ అయితే.. మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా.. ప్రేమించడమంటే మనకు ఇష్టమైన వాళ్లకోసం ఇష్టమైనది చేయడమే కదా.. వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

అలాగే తమన్నా కూడా మంచి మెచ్యూర్ రోల్ లో కనిపిస్తుంది. ఇంకా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కనిపిస్తుంది. ఈ సినిమాకు కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!