AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panja Vaishnav Tej : మెగా హీరో ‘ఉప్పెన’లా ఎగసి పడుతున్న ఆఫర్లు.. అప్పుడే నాలుగో సినిమాను కూడా లైన్ లో పెట్టిన వైష్ణవ్..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’.  ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా  బాక్సాపీస్‌ వద్ద ఇప్పటికీ దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.100కోట్లకు

Panja Vaishnav Tej :  మెగా హీరో 'ఉప్పెన'లా ఎగసి పడుతున్న ఆఫర్లు.. అప్పుడే నాలుగో సినిమాను కూడా లైన్ లో పెట్టిన వైష్ణవ్..
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2021 | 2:50 AM

Share

Panja Vaishnav Tej : మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’.  ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా  బాక్సాపీస్‌ వద్ద ఇప్పటికీ దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులను తిరగరాసింది. సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. ఇక రాక్ స్టార్ దేవీశ్రీ సంగీతం, విజయ్‌ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్‌ అయింది. విలన్‌ పాత్రలో కనిపించిన విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది.

అయితే ఈ కుర్ర హీరో మొదటి సినిమా రిలీజ్ అవ్వక ముందే రెండో సినిమాను పూర్తి చేసాడు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు క్రిష్ తెరకెక్కించాడు . క్రిష్ ఫ్రెండ్ వై.రాజీవ్‌రెడ్డి, తండ్రి జాగ‌ర్ల‌మూడి సాయిబాబా ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. . ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన  ఈ చిత్రాన్ని అత్యంత స‌హ‌జ‌త్వంగా రూపొందినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు కొండ పొలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక  వైష్ణవ్ త్వరలో తన మూడో ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుండి ఓ నూతన దర్శకుడు  వైష్ణవ్ మూడో సినిమా తెరకెక్కించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో నాలుగో సినిమాను కూడా లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. ఆ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇలా వరుస సినిమాలతో ఈ మెగా హీరో ఫుల్ బిజీగా మారిపోయాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ileana D’Cruz : ‘నా శరీరంలో అవి నాకు కూడా నచ్చవు’.. ట్రోల్స్ చేసేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇలియానా..

Naga Chaitanya : మీ అభిమానం సల్లగుండా.. ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయినా అక్కినేని యంగ్ హీరో..

Follow Us
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?