AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana D’Cruz : ‘నా శరీరంలో అవి నాకు కూడా నచ్చవు’.. ట్రోల్స్ చేసేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇలియానా..

దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియాన డిసౌజ. టాలీవుడ్‌లో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామ అప్పట్లో టాప్ హీరోయిన్ గా దూసుకు పోయింది

Ileana D'Cruz  : 'నా శరీరంలో అవి నాకు కూడా నచ్చవు'.. ట్రోల్స్ చేసేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇలియానా..
 టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసింది ఇలియానా 
Rajeev Rayala
| Edited By: Team Veegam|

Updated on: Mar 09, 2021 | 7:28 PM

Share

Ileana D’Cruz : దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానాడిసౌజ. టాలీవుడ్‌లో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామ అప్పట్లో టాప్ హీరోయిన్ గా దూసుకు పోయింది. తెలుగులో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యలో ఈ బ్యూటీకి అస్సలు ఛాన్సులు రావడం లేదు. దీంతో ఈ గోవా బ్యూటీ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఆతర్వాత ఆమె బరువు పెరగడం,ప్రేమ విఫలం అవ్వడం ఇలా వరుసగా జరగడంతో డిప్రషన్ లోకి వెళ్ళింది. ఆతర్వాత కోలుకొని పాత ఇలియానాలా మారింది. లావుగా ఉన్న సమయంలో తెలుగులో రీ ఎంట్రీ ఇద్దామనుకున్న ఆ ప్లాన్ బెడిసికొట్టింది. రవితేజతో నటించిన అమర్ అక్బర్ అంథోని సినిమా దారుణంగా నిరాశపరిచింది. అయితే సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి ఫోటోలు పెట్టిన ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు.

అయితే సెలబ్రెటీలు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేయడం కామన్. అయితే ఇలియానాను కూడా ఇలా ట్రోల్ చేస్తున్నారట. ఈ విషయం పై ఈ అమ్మడు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తనలో కూడా బ్యూటీ స్పాట్స్ ఉన్నాయని కానీ వాటిని వదిలేసి మిగిలిన వాటిలో లోపాలను ఎత్తిచూపడం సరికాదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన శరీరంలో కొన్ని భాగాలు తనకు కూడా నచ్చవని తెలిపింది. చూడ్డానికి అంత పొడవుగా కనిపించనని నల్లగా కూడా ఉంటానని, అలాగే ఎదభాగంతోపాటు చేతులు సన్నగా ఉంటాయని ముక్కు పెదాలు కూడా సరిగా ఉండవని చెప్పింది ఇలియానా. ఈ విషయాలను తనను వేధిస్తుంటాయని, ఎవరైనా తన శరీరాకృతి గురించి చెప్పమంటే ఇబ్బంది పడతానని తెలిపింది.

మరిన్ని ఇక్కడ చదవండి :  Naga Chaitanya : మీ అభిమానం సల్లగుండా.. ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయినా అక్కినేని యంగ్ హీరో..

Balakrishna : ఇద్దరు విలన్లను ఢీ కొట్టనున్న నటసింహం.. బోయపాటి సినిమాలో ఆ హీరోకూడా విలన్ గా కనిపించనున్నాడా..?

ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…