Balakrishna : ఇద్దరు విలన్లను ఢీ కొట్టనున్న నటసింహం.. బోయపాటి సినిమాలో ఆ హీరోకూడా విలన్ గా కనిపించనున్నాడా..?

నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బీబీ 3 అనే

Balakrishna : ఇద్దరు విలన్లను ఢీ కొట్టనున్న నటసింహం.. బోయపాటి సినిమాలో ఆ హీరోకూడా విలన్ గా కనిపించనున్నాడా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 09, 2021 | 1:34 AM

Nandamuri Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బీబీ 3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో.. ఇప్పటికే రెండు సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు రూపుదిద్దుకుంటోన్న మూడవ చిత్రంతో వారిద్దరూ ‘హ్యాట్రిక్‌’ విజయం అందుకోవడం పక్కా అని అభిమానులు అంటున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్పుడెప్పుడో మినీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య లుక్స్.. డైలాగ్స్ కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. తనదైన యాక్షన్ మేనరిజంతో బాలకృష్ణ అదరగొట్టారు. దీంతో.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో బాలయ్య ఇద్దరు విలన్ లతో తలపడనున్నాడని తెలుస్తుంది. బోయపాటి ‘లెజెండ్’తో విలన్ గా సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టిన జగపతిబాబు ఈ సినిమాలోనూ విలన్ గా కనిపించనున్నాడట . అలాగే  ఇన్నాళ్లు హీరోగా ఆకట్టుకున్న శ్రీకాంత్ కూడా ఈ సినిమా విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. జగపతి బాబుతో కలిసి శ్రీకాంత్ ను ఢీకొట్టబోతున్నాడు బాలకృష్ణ. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే.. శివరాత్రి సందర్భంగా సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారని ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mosagallu : ‘మోసగాళ్లు’ సినిమాలో కాజల్ కంటే ముందు ఆ హీరోయిన్ ను అనుకున్నారట.. కానీ

Nikhil Siddharth : వరుస సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో… మెగాహీరో కథతో సినిమా చేస్తున్న నిఖిల్..

Varun Tej : సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాహీరో.. ఆ దర్శకుడితో వరుణ్‌‌‌తేజ్ సినిమా.?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!