Nikhil Siddharth : వరుస సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో… మెగాహీరో కథతో సినిమా చేస్తున్న నిఖిల్..
టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నిఖిల్. ఈ కుర్ర ;హీరో నూతన దర్శకులను ప్రోత్సహిస్తూ మంచి కథలతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో
Nikhil Siddharth new movie : టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నిఖిల్. ఈ కుర్ర ;హీరో నూతన దర్శకులను ప్రోత్సహిస్తూ మంచి కథలతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో వెలుగులోకి వచ్చిన నిఖిల్ ఆతర్వాత సోలో హీరోగా చాలా సినిమాలో నటించాడు. స్వామి రారా.., కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి సినిమాలు నిఖిల్ కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన సూపర్ హిట్ సినిమా కార్తికేయ సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
అలాగే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘18 పేజీస్’ సినిమాలో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే నిఖిల్ త్వరలో మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ప్రముఖ రచయిత కోనా వెంకట్ రాసిన ఓ కథతో నిఖిల్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ కథ మెడికల్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. అయితే నిజానికి కోన ఈ కథను ముందుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు వినిపించాడట. కథ నచ్చినప్పటికీ ముందుగా కమిట్ అయినా సినిమాల కారణంగా తేజ్ తో సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఈ కథను నిఖిల్ కు వినిపించాడట కోన. విభిన్న కథలతో సినిమాలు చేయడానికి ముందుండే నిఖిల్ వెంటనే ఈ కథను ఓకే చేసాడని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
నేను తప్పు చేసి ఉంటే శిక్షకు సిధ్ధమే , ఐటీ దాడులపై నటి తాప్సీ పొన్ను వ్యాఖ్య