నేను తప్పు చేసి ఉంటే శిక్షకు సిధ్ధమే , ఐటీ దాడులపై నటి తాప్సీ పొన్ను వ్యాఖ్య

ఇటీవల తన  ఇంటిపైన, కార్యాలయం పైన జరిగిన ఐటీ దాడులపై సినీనటి తాప్సీ పొన్ను నేరుగా స్పందించింది. తాను తప్పు చేసి ఉంటే శిక్షకు సిధ్ధమేనని తెలిపింది. తాను...

నేను తప్పు చేసి ఉంటే శిక్షకు సిధ్ధమే , ఐటీ దాడులపై నటి తాప్సీ పొన్ను వ్యాఖ్య
Follow us

|

Updated on: Mar 08, 2021 | 7:23 PM

ఇటీవల తన  ఇంటిపైన, కార్యాలయం పైన జరిగిన ఐటీ దాడులపై సినీనటి తాప్సీ పొన్ను నేరుగా స్పందించింది. తాను తప్పు చేసి ఉంటే శిక్షకు సిధ్ధమేనని తెలిపింది. తాను, తన కుటుంబం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు  పూర్తిగా సహకరించామని ఆమె స్పష్టం చేసింది. అసలు ఈ దాడులు ఎందుకు జరిగాయో , ఎవరు తనకు 5 కోట్లు ఇచ్చారో కూడా తనకు తెలియదని తాప్సీ  వెల్లడించింది. దాడుల సందర్భంగా ఈమె ఇంట్లో తాము రూ. 5 కోట్ల సొమ్ము తాలూకు రసీదులు కనుగొని స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇలాంటివేవీ కనుగొనలేదని ఐటీ శాఖ చెబుతోంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ సొమ్ము అందుకున్నట్టు ప్యారిస్ లో నాకు బంగళా ఉన్నట్టు..ఇలా ఎన్నో వార్తలు బయటికొచ్చాయి.కానీ నేను, నా కుటుంబం ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ  సమాధానం ఇచ్చాం’ అని ఆమె తెలిపింది.తానేదైనా తప్పు చేసి ఉంటే ఆ విషయం బయటపడేదని,  ఒకవేళ చేసి ఉన్న పక్షంలో శిక్షకు సిద్ధమేనని, ఏదీ దాచబోనని ఆమె పేర్కొంది.దాడులు జరిగినప్పుడు ప్రొసీజర్ కి తోడ్పడాల్సిందే ..మరో మార్గం లేదు అని తాప్సీ వ్యాఖ్యానించింది.

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ దాడులపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె స్పందిస్తూ.. ఇది ప్రొసీజర్ అని ఆమె చెప్పడం సబబేనని, దీన్ని సెన్సేషనలైజ్ చేయవద్దని కోరింది. 2013 లో కూడా తాప్సి పొన్ను ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని, అది అప్పుడు సమస్య కాలేదని, కానీ ఇప్పుడు ఇష్యూ అయిందని నిర్మల పేర్కొన్న సంగతి విదితమే. కాగా ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్,  తాప్సీ పొన్ను, మరికొందరి ఇళ్లపై  ఇటీవల ఐటీ  దాడులు జరిగాయి. ఈ దాడులపై మొదట తాప్సి తన ట్విటర్ లో స్పందించింది.

మరిన్ని చదవండి ఇక్కడ :

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

WhatsApp: వాట్సాప్ లో ఒక ఇంట్రెస్టింగ్ కొత్త ఫీచర్ రానుంది అది ఏంటిఅంటే…??