Jr.NTR: ఆకాశమే హద్దుగా అమెరికాలో తారక్‌ అభిమానుల సందడి.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే..

తారక్ కొమురం భీమ్ పాత్రలో కనిపించగా.. రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన వీరిద్దరి అక్కడి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన తారక్‏కు యూఎస్ ప్యాన్స్ ప్రత్యేక థాంక్స్ చెప్పారు.

Jr.NTR: ఆకాశమే హద్దుగా అమెరికాలో తారక్‌ అభిమానుల సందడి.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే..
Jr.ntr
Follow us

|

Updated on: Mar 20, 2023 | 5:24 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ మారిపోయింది. వీరిద్దరి నటనకు హాలీవుడ్ డైరెక్టర్స్.. ఫిల్మ్ లవర్స్ ఫిదా అయ్యారు. ఇక ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించారు జక్కన్న అండ్ టీం. విశ్వవేదికపై భారతీయ సినిమా స్థాయిని పెంచారు జక్కన్న. ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు సౌత్ సినిమాలపై పడింది. ఇందులో తారక్ కొమురం భీమ్ పాత్రలో కనిపించగా.. రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన వీరిద్దరి అక్కడి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన తారక్‏కు యూఎస్ ప్యాన్స్ ప్రత్యేక థాంక్స్ చెప్పారు.

వినూత్న పద్ధతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రపంచ సినిమా గుండెపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎయిర్ ప్లేన్ బ్యానర్. థాంక్యూ ఎన్టీఆర్.. NTR30 కోసం ఎదురుచూడలేకపోతున్నాము అంటూ కట్టిన బ్యానర్ ను విమానంతో ఆకాశంలో ఎగురవేశారు. ఆకాశంలో రెపరెపలాడుతున్న బ్యానర్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం తారక్… మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా మార్చి 23న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభంకాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.