Vishwak Sen: కాలినడకన తిరుమలకు విశ్వక్ సేన్.. నెట్టింట వీడియో వైరల్..

ఇటీవల జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా సందడి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కానుంది.

Vishwak Sen: కాలినడకన తిరుమలకు విశ్వక్ సేన్.. నెట్టింట వీడియో వైరల్..
Vishwak Sen
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 20, 2023 | 3:09 PM

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించగా.. ఇందులో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఇటీవల జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా సందడి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో విశ్వక్ కాలినడకన తిరుమలకు వెల్లారు. నిన్న రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల ఆలయానికి చేరుకున్నారు. సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

పాగల్, ఓరి దేవుడా సూపర్ హిట్స్ అనంతరం విశ్వక్ సేన్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోనూ విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో రావు రమేష్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలకపాత్రలలో నటించగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.