Niharika: పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన చైతన్య.. నిహారిక వైవాహిక జీవితంలో అసలేం జరుగుతోంది.?
సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త షికారు చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వైవాహిక జీవితంపై పుకార్లకు లెక్కే ఉండదు. కొన్నిసార్లు ఈ వార్తలు ఊహాగానాలుగానే మిగిలిపోతే, మరికొన్ని సార్లు మాత్రం నిజం అవుతుంటాయి. తాజాగా మెగా డాటర్ నిహారిక విషయంలో ఇలాంటి..
సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త షికారు చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వైవాహిక జీవితంపై పుకార్లకు లెక్కే ఉండదు. కొన్నిసార్లు ఈ వార్తలు ఊహాగానాలుగానే మిగిలిపోతే, మరికొన్ని సార్లు మాత్రం నిజం అవుతుంటాయి. తాజాగా మెగా డాటర్ నిహారిక విషయంలో ఇలాంటి పుకార్లే షికార్లు చేస్తున్నాయి. అదే.. ‘నిహారిక, చైతన్య వైవాహిక జీవితం నుంచి తప్పుకున్నారా.?’ ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ జరుగుతోంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే సోషల్ మీడియాలో కాలంలో ప్రతీది వైరల్‌గా మారుతుంది.
గతంలో కూడా నిహారిక, చైతన్య విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత దీంట్లో నిజం లేదని తేలింది. అయితే ఈసారి దీనికి ఓ బలమైన కారణాన్ని చూపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్య, నిహారికలు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చైతన్య ఏకంగా పెళ్లినాటి ఫొటోలోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో నుంచి డిలీట్ చేయడం ఇవన్నీ.. విడాకుల వార్తలకు ఊతమిస్తోంది. దీనినే కారణంగా చూపిస్తూ.. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
గతంలోనూ ఇలాంటి పుకార్లు వచ్చినా.. తర్వాత చైతన్య పుకార్లకు చెక్ పెడుతూ నిహారికతో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో అప్పట్లో వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ఈసారి ఏకంగా ఫొటోలు డిలీట్ చేయడంతో పుకార్లకు మరింత బలానిచ్చినట్లైంది. ఇదిలా ఉంటే నిహారిక, చైతన్యల వివాహం 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో జరిగిన విషయం తెలిసిందే. మరి వీరి విడాకులపై వస్తున్న పుకార్లపై ఈ స్టార్ కపుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..