Nikhil Siddharth: హిస్టరీ క్రియేట్ చేసిన యంగ్ హీరో.. ఐకానిక్ గోల్డ్ అవార్డ్ అందుకున్న నిఖిల్..

తాజాగా ఇదే చిత్రంతో నిఖిల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు.

Nikhil Siddharth: హిస్టరీ క్రియేట్ చేసిన యంగ్ హీరో.. ఐకానిక్ గోల్డ్ అవార్డ్ అందుకున్న నిఖిల్..
Nikhil
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 20, 2023 | 2:50 PM

గతేడాది వరుస సూపర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ మీదున్నారు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత వెంటనే 18 పేజెస్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కార్తికేయ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 121 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగుతోపాటు.. హిందీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ నుంచి నిఖిల్‏కు ఫాలోయింగ్ పెరిపోయింది. ఈచిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తాజాగా ఇదే చిత్రంతో నిఖిల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా… దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతోపాటు..పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్త్రీయమైనదేనని బలంగా చెప్పాడు. మనిషి జీవనం ఎలా ఉండాలని శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.

ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం నిఖిల్.. స్పై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా ఐదు భాషల్లో రూపొందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.