Vairam Movie: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న విలన్ దేవరాజ్ తనయుడు.. ‘వైరం’ టీజర్ రిలీజ్..

దేవరాజ్ కుమారుడు ప్రణం దేవరాజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం "వైరం". ఈ సినిమాకు సాయి శివం జంపాన దర్శకత్వం వహిస్తుండగా.. జె.మల్లికార్జున నిర్మిస్తున్నారు.

Vairam Movie: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న విలన్ దేవరాజ్ తనయుడు.. 'వైరం' టీజర్ రిలీజ్..
Pranam Devaraj
Follow us

|

Updated on: Mar 20, 2023 | 3:29 PM

తెలుగు ప్రేక్షకులకు నటుడు దేవరాజ్ సుపరిచితమే. ఎన్నో హిట్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు తనయుడు ప్రణం దేవరాజ్ హీరోగా వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్, సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్ పై దేవరాజ్ కుమారుడు ప్రణం దేవరాజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం “వైరం”. ఈ సినిమాకు సాయి శివం జంపాన దర్శకత్వం వహిస్తుండగా.. జె.మల్లికార్జున నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ నటులు దేవరాజ్, చంద్ర దేవరాజ్ ల చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, బెనర్జీ, కాశీ విశ్వనాధ్ చేతుల మీదుగా వైరం టీజర్ విడుదల చేయడం జరిగింది.

అనంతరం సీనియర్ నటులు దేవరాజ్ మాట్లాడుతూ..” తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు వస్తున్న నా కొడుకును కూడా అదేవిదంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకుడు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా టీజర్ కు కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీజర్ కు కూడా అంతే బాగుందని చెపుతున్నారు. ఎంతో కష్టపడి తీసిన నిర్మాత మల్లికార్జునకు ఈ సినిమామా మంచి పేరు తెస్తుంది. KGF లాంటి సినిమాలో నటించిన గరుడ రామ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. “సాయి గారు నాకు మంచి సినిమా ఇచ్చారు.సామల భాస్కర్ గారు మమ్మల్ని చాలాబాగా చూయించారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. మా తల్లి తండ్రులు సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడై వరకు వచ్చే వాన్ని కాదు.తెలుగు ప్రేక్షకులు మా నాన్న దేవరాజ్ గారిని ఆదరించి నట్లే వైరం సినిమాతో వస్తున్న నన్ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నాను.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.