Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. పుష్ప 2 టీజర్ వచ్చేస్తోంది.. ఏకంగా అన్ని నిమిషాలే..

తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 అప్డేట్ గురించి ఫిల్మ్ సర్కిల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. పుష్ప 2 టీజర్ వచ్చేస్తోంది.. ఏకంగా అన్ని నిమిషాలే..
Pushpa 2
Follow us

|

Updated on: Mar 20, 2023 | 5:45 PM

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప చిత్రం సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు… నార్త్ లోనూ ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించారు సుకుమార్. మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో రిలీజ్ చేయగా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 అప్డేట్స్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అప్డేట్స్ ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 అప్డేట్ గురించి ఫిల్మ్ సర్కిల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న బన్నీ అభిమానులకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారట డైరెక్టర్ సుకుమార్. ఈ క్రమంలోనే ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణలో నుంచి ఓ మూడు నిమిషాల యాక్షన్ టీజర్ ను సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయ్యిందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జరుగుతుందని సమాచారం. మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. బన్నీ బర్త్ డే కానుకగా రిలీజ్ కాబోయే ఈ టీజర్ యాక్షన్ షాట్స్ ఎక్కువగానే ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నారట.

ఇవి కూడా చదవండి

సెకండ్ పార్ట్ పై ఇప్పటికే అనేక గాసిప్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితోపాటు.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సైతం కీలకపాత్రలలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు