AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య గొప్ప మనసు.. తారకరత్న పేరు మీద ఫ్రీగా సర్జరీ.. కోటిన్నర పెట్టి సర్జికల్ ఇన్స్రుమెంట్స్..

తారకరత్న మరణానంతరం.. ఆయన కుటుంబానికి అన్ని తానై అండగా ఉన్నారు బాలయ్య. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ తారకరత్న మృతి నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Balakrishna: బాలయ్య గొప్ప మనసు.. తారకరత్న పేరు మీద ఫ్రీగా సర్జరీ.. కోటిన్నర పెట్టి సర్జికల్ ఇన్స్రుమెంట్స్..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2023 | 7:20 PM

Share

నందమూరి తారకరత్న అకాల మరణాన్ని అటు అభిమానులు.. ఇటు కుటుంబసభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేరనే విషయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి వేదన వర్ణానాతీతం. చివరి వరకు తోడుంటానని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇక కనిపించడనే నిజాన్ని ఆమె భరించలేకపోతుంది. తన భర్తతో కలిసి ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. గుండెలోని బాధను బయటపెడుతుంది. గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న దాదాపు 23 రోజులు పోరాడి మృతి చెందారు. తారకరత్న గుండెపోటుకు గురైన రోజు నుంచి చివరిరోజు వరకు ఆసుపత్రిలోనే దగ్గరుండి చూసుకున్నారు బాలకృష్ణ. తనతో ఎంతో ప్రేమగా ఉండే తనయుడు మృత్యువును జయించి తిరిగి రావాలని దేవుళ్లను ప్రార్థించారు. తారకరత్న మరణానంతరం.. ఆయన కుటుంబానికి అన్ని తానై అండగా ఉన్నారు బాలయ్య. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ తారకరత్న మృతి నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

తన ఇంట్లో వచ్చిన కష్టం.. మరొకరి ఇంట్లో రాకూడదని పేద ప్రజల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తారకరత్న పేరు మీదు కార్డియాక్ అరెస్ట్.. తోయార్సిక్ సర్జరీలు పేదలకు ఉచితంగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట. హిందూపురంలో తను నిర్మించిన ఆసుపత్రిలో H-Block కి తారకరత్న పేరు పెట్టారట. అంతేకాకుండా.. విదేశాల నుంచి రూ.1 కోటి 30 లక్షల విలు చేసే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పిస్తున్నారట. అలాగే ఆసుపత్రిలో చిన్న పిల్లలకు ఉచిత భోజనంతోపాటు కావాల్సిన మందులు కూడా 3 నెలల పాటు ఫ్రీగా ఇవ్వనున్నారట. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల కార్టియాక్ అరెస్ట్ తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. చిన్న వయసులోనే ఉన్నట్లుండి చిట్టి గుండెలు ఆగిపోతున్నాయి. అప్పటివరకు తమతో ఎంతో సంతోషంగా ఆడిపాడినవాళ్లు క్షణాల్లోనే కళ్లముందు విగతజీవులుగా మారుతున్నారు. ఈ క్రమంలో పేద ప్రజలకు ఉచితంగా కార్టియాక్ అరెస్ట్.. తోయార్సిక్ అరెస్ట్ సర్జరీలు చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. పైకీ కటువుగా కనిపిస్తారు.. కానీ మనసు మాత్రం బంగారం అని అంటున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.