Uday Kiran: మరణించిన తర్వాత విడుదల అవుతోన్న ఉదయ్ కిరణ్ చివరి సినిమా.. ఓటీటీ వేదికగా..
Uday Kiran: ఉదయ్ కిరణ్.. ఓ తరం ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లోనే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడీ యంగ్ హీరో. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించి...
Uday Kiran: ఉదయ్ కిరణ్.. ఓ తరం ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లోనే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడీ యంగ్ హీరో. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించి టాప్ హీరోలకు సైతం పోటీనిచ్చాడు. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే అర్థాంతరంగా తనువు చాలించాడు ఉదయ్. అప్పట్లో ఉదయ్ మరణం చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఇదిలా ఉంటే ఉదయ్ చివరిగా నటించిన చిత్రం మూవీ `చిత్రం చెప్పిన కథ`ని విడదుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2014లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. అయితే తాజాగా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ సినిమాను ప్రేక్షకులను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇందులో భాగంగానే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చిత్ర చెప్పిన కథ సినిమాకు ఏఎల్ఆర్కే దర్శకత్వం వహించగా.. సీహెచ్ మున్నా నిర్మాతగా వ్యవహరించాడు. ఇక బాలీవుడ్ నటి మదాలసా శర్మా ఉదయ్‌కి జోడిగా నటించింది. మరి ఉదయ్ కిరణ్ చివరి చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Ardha Shatabdham on aha: ఈనెల 11న ‘ఆహా’లో విడుదలవుతున్న ‘అర్థశతాబ్దం’.. ఆ మూవీ స్పెషాలిటీస్ ఇవే
RCFL Recruitment: డిగ్రీ అర్హత ఉన్నవారికి మంచి అవకాశం మంచి వేతనంతో జాబ్ నోటిఫికేషన్..