Trivikram: ఆ హీరోయిన్‌కు ‘ఐలవ్యూ’ చెప్పిన గురూజీ.. ‘నా భార్యకు కూడా చెబుతా’నంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

తన సినిమాల్లో ఎమోషన్స్‌, ఫ్యామిలీ వ్యాల్యూస్‌కు పెద్దపీట వేసే త్రివిక్రమ్‌.. హీరోయిన్ల పాత్రలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. అందుకే ఆయన సినిమాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా కాకపోయినా

Trivikram: ఆ హీరోయిన్‌కు 'ఐలవ్యూ' చెప్పిన గురూజీ.. 'నా భార్యకు కూడా చెబుతా'నంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Trivikram Srinivas
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2023 | 3:35 PM

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. తన పదునైన కలంతో స్టార్‌ హీరోలకు మించి క్రేజ్‌ తెచ్చుకున్న డైరెక్టర్‌. సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత కాలంలో స్టార్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ లాంటి బడా హీరోలతో సూపర్‌ డూపర్‌ హిట్లు తెరకెక్కించారు. తన సినిమాల్లో ఎమోషన్స్‌, ఫ్యామిలీ వ్యాల్యూస్‌కు పెద్దపీట వేసే త్రివిక్రమ్‌.. హీరోయిన్ల పాత్రలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. అందుకే ఆయన సినిమాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా కాకపోయినా సెకెండ్‌ హీరోయిన్‌గానైనా చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇక త్రివిక్రమ్‌ సినిమాల్లో హీరోయిన్లు రిపీటవ్వడం తరచుగా జరుగుతోంది. జల్సా, జులాయి సినిమాల్లో ఇలియానా, అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి, అ ఆ చిత్రాల్లో సమంత, అరవిందసమేత, అలవైకుంఠపురం, ఎస్ఎస్‌ఎమ్‌బీ 28 సినిమాల్లో పూజా హెగ్డే.. ఇలా మాటల మాంత్రికుడి సినిమాల్లో మన అందాల భామలు మళ్లీ మళ్లీ కనిపిస్తుంటారు. బహుశా వీరి నటనకు గురూజీకి ఫిదా అయ్యారేమో. ఇప్పుడు త్రివిక్రమ్‌ మరో అందాల భామకు ఫిదా అయ్యారు. ఆమె మరెవరో కాదు భీమ్లానాయక్‌తో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్‌. ప్రస్తుతం ఆమె ధనుష్‌తో కలిసి సార్‌ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు త్రివిక్రమ్‌ హాజరయ్యారు. ఎప్పటిలాగే తన స్పీచ్‌తో అదరగొట్టేశారు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్ స్పీచ్‌లో భాగంగా సంయుక్తపై ప్రశంసల వర్షం కురిపించిన గురూజీ అందరి ముందే ఆమెకు ఐ లవ్యూ చెప్పేశారు. దీంతో ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. దీనికి స్పందించిన త్రివిక్రమ్‌.. ‘లేదండి బాబూ.. పూర్తిగా చెప్పేది వినండి.. కంగారు పడకండి ..మా ఆవిడకు కూడా చెబుతాను నువ్వు (సంయుక్త) అడిగావని’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే హీరోయిన్‌ అభినయానికి ఫిదా అయ్యే గురూజీ ఈ మాటలు అన్నారని అర్థమవుతోంది. ఏదేమైనా సార్‌ ఈవెంట్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్పీచ్‌ మరోసారి హైలెట్‌గా నిలిచింది. కాగా సార్‌ సినిమాకు త్రివిక్రమ్‌ సతీమణి సౌజన్య కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 17)న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..