Samantha: ప్రేమికుల దినోత్సవం రోజు సమంత ఏం పోస్ట్‌ చేసిందో తెలుసా.? తన ప్రేమ అదేనని చెప్పకనే చెప్పేసింది..

ఈ మధ్య కాలంలో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది నటి సమంత. విడాకుల వ్యవహారం ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధి ఇలా హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది సామ్‌. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులోని ఓ ఆలయంలో మెట్టు మెట్టుకి దీపాలను వెలిగిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే...

Samantha: ప్రేమికుల దినోత్సవం రోజు సమంత ఏం పోస్ట్‌ చేసిందో తెలుసా.? తన ప్రేమ అదేనని చెప్పకనే చెప్పేసింది..
Samantha
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 16, 2023 | 6:19 PM

ఈ మధ్య కాలంలో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది నటి సమంత. విడాకుల వ్యవహారం ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధి ఇలా హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది సామ్‌. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులోని ఓ ఆలయంలో మెట్టు మెట్టుకి దీపాలను వెలిగిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. దీంతో సమంత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ఇలా దీపాలను వెలిగించిందంటూ నెట్టింట వార్తలు పుట్టుకొచ్చాయి. తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో సమంత నిర్వహించిన ప్రత్యేక పూజలు వైరల్‌ అయ్యాయి.

ఇదిలా ఉంటే సినిమా కోసం నిత్యం తనను తాను మార్చుకుంటూ వస్తోంది సామ్‌. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ఓ వెబ్‌ సిరీస్‌ కోసం యాక్షన్‌ క్వీన్‌గా మారుతోంది. ఓవైపు కండరాలను బలహీన పరిచే మాయదారి వ్యాధితో బాధపడుతోన్నా డెడికేషన్‌ విషయంలో మాత్రం తగ్గడం లేదు సామ్‌. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాక్సింగ్ ప్రాక్టిస్‌ చేస్తోంది సమంత. ఇదిలా ఉంటే తాజాగా వాలేంటైన్స్‌ డే రోజు సమంత ఓ ఆసక్తికర పోస్ట్‌ను చేసింది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమకు సంబంధించిన పోస్టులు చేస్తుంటారు. అయితే సామ్‌ మాత్రం బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది. దానికి హ్యాపీ వాలేంటైన్స్‌ డే అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేసింది. దీంతో తనకు సినిమా అంటే ఎంత ప్రేమో అనే విషయాన్ని సామ్‌ చెప్పకనే చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..