Balakrishna: పీక్ రేంజ్‌కు బాలయ్య ఇమేజ్.. ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే స్టన్
ప్రజంట్ బాలయ్య ఇమేజ్ పతాక స్థాయిలో ఉంది. అటు సినిమాల్లో కథానాయకుడిగా.. ఇటు ఓటీటీ హోస్ట్‌గా దుమ్ము లేపేస్తున్నారు.

ప్రజంట్ బాలయ్య రేంజ్ మారిపోయింది. కెరీర్‌లోనే పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అటు అన్ స్టాపబుల్ షోలో హోస్ట్‌గా దుమ్మురేపుతున్నారు. ఇటు అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బంపర్ హిట్స్ అందుకున్నారు. దీంతో బాలయ్య రేంజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది. ప్రజంట్ బాలయ్య ఒక్కో సినిమాకు 20 కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడస్తుంది.
ప్రజంట్ నటసింహం.. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎన్.బి.కే 108 మూవీ చేస్తున్నాడు. తన పంథాను మార్చి.. తండ్రి, కుమార్తె ఎమోషన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అనిల్ రూపొందిచనున్నారు. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేయనున్నారు బాలయ్య. పూరి డైరెక్షన్ ఓ సినిమా కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. క్రిష్ బోయపాటి కూడా లైన్‌లో ఉన్నారు. వీరే కాదు.. యంగ్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా చెప్పిన లైన్స్ కూడా బాలయ్యకు నచ్చినట్లు తెలుస్తోంది.
NBK 109ని ఓ కొత్త డైరెక్టర్‌తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్స్ నడుస్తున్నాయట. ఆ డైరెక్టర్ ఇటీవలే తన ఫస్ట్ మూవీతో మంచి హిట్ అందుకున్నారని సమాచారం. అయితే ఈ చర్చల్లో ఓ చిన్న ప్రాబ్లమ్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్. అదేంటంటే.. ఈ సినిమాకు బాలయ్య రూ.20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారట. అయితే ఆ డైరెక్టర్ కూడా తనకు రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్.. కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇస్తానని, నాన్ థియేట్రికల్ లాభాల్లో 20 శాతం షేర్ ఇస్తానని చెబుతున్నారట. అయితే దీనిపై దర్శకుడు మాత్రం నో చెబుతున్నాడట.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.