AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అ’దే అక్షరం.. సెంటిమెంట్ వీడని త్రివిక్రమ్

పైకి కనిపించకపోయినా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సెంటిమెంట్లను బాగానే నమ్ముతారు. ముఖ్యంగా తెలుగులో ‘అ’ అనే అక్షరంపై త్రివిక్రమ్‌కు చాలా నమ్మకం. ఈ అక్షరంతోనే ఐదు చిత్రాలను(అతడు, అత్తారింటికి దారేది, అఆ, అఙ్ఞాతవాసి, అరవింద సమేత) తెరకెక్కించాడు త్రివిక్రమ్. వీటిలో ‘అఙ్ఞాతవాసి’ మినహాయిస్తే మిగిలినవన్నీ మంచి విజయాలను సాధించాయి. దీంతో ‘అ’ అక్షరాన్ని వదల్లేకపోతున్నాడు ఈ దర్శకుడు. ఈ నేపథ్యంలో బన్నీ చిత్రానికి కూడా ‘అ’తో ప్రారంభం అయ్యేలా ‘అలకనంద’ అని పెట్టాలనుకుంటున్నాడట. ఈ సినిమాలో టబు […]

‘అ’దే అక్షరం.. సెంటిమెంట్ వీడని త్రివిక్రమ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 16, 2019 | 12:15 PM

Share

పైకి కనిపించకపోయినా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సెంటిమెంట్లను బాగానే నమ్ముతారు. ముఖ్యంగా తెలుగులో ‘అ’ అనే అక్షరంపై త్రివిక్రమ్‌కు చాలా నమ్మకం. ఈ అక్షరంతోనే ఐదు చిత్రాలను(అతడు, అత్తారింటికి దారేది, అఆ, అఙ్ఞాతవాసి, అరవింద సమేత) తెరకెక్కించాడు త్రివిక్రమ్. వీటిలో ‘అఙ్ఞాతవాసి’ మినహాయిస్తే మిగిలినవన్నీ మంచి విజయాలను సాధించాయి. దీంతో ‘అ’ అక్షరాన్ని వదల్లేకపోతున్నాడు ఈ దర్శకుడు. ఈ నేపథ్యంలో బన్నీ చిత్రానికి కూడా ‘అ’తో ప్రారంభం అయ్యేలా ‘అలకనంద’ అని పెట్టాలనుకుంటున్నాడట.

ఈ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనుంది. కథానుగుణంగా సినిమా మొత్తం టబు చుట్టూనే తిరుగుతుండగా.. ఆమె పాత్ర పేరు, సినిమా పేరు ఒకే విధంగా ఉండేలా త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. అంతకు ముందు ఈ సినిమా కోసం ‘‘నాన్న.. నేను’’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు ‘అలకనంద’ను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది. థమన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.