‘జెర్సీ’కి ఆర్ ‘యు’ రెడీ..!

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తి అయింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా క్లీన్ ‘యు’ను ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన నాని ‘ఆర్ యు రెడీ’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. Are ‘U’ ready ? ? pic.twitter.com/acvfqmNs8k […]

‘జెర్సీ’కి ఆర్ ‘యు’ రెడీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2019 | 12:38 PM

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తి అయింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా క్లీన్ ‘యు’ను ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన నాని ‘ఆర్ యు రెడీ’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు.

కాగా క్రీడా నేపథ్యంలో సాగిన ఈ చిత్రంలో నాని క్రికెట్ కోచ్‌గా కనిపించబోతున్నాడు. ఆయన సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. సత్యరాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌, పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు కృష్ణార్జున యుద్ధం, దేవదాసు చిత్రాల పరాజయాలతో కాస్త డీలా పడ్డ నాని ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలనుకుంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.