‘కాప్పాన్’ విడుదల ఎప్పుడంటే..!
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కాప్పాన్’. ఈ సినిమాకు కెవి ఆనంద్ దర్శకుడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బొమన్ ఇరానీ, ఆర్య, చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సయేషా సైగల్ కథానాయికగా నటిస్తుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ఆగష్టు 30న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తమ ట్విట్టర్ ద్వారా అధికారకంగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కాగా […]

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కాప్పాన్’. ఈ సినిమాకు కెవి ఆనంద్ దర్శకుడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బొమన్ ఇరానీ, ఆర్య, చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సయేషా సైగల్ కథానాయికగా నటిస్తుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ఆగష్టు 30న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తమ ట్విట్టర్ ద్వారా అధికారకంగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కాగా నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
మరోవైపు సూర్య ఈ సినిమాతో పాటు ఎన్‌జికె అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య ,సుధా కొంగర డైరెక్షన్‌లో సురరై పోట్రు అనే చిత్రంలో నటిస్తున్నాడు.
Thank you for the Fantastic response for the #Kaappaan Teaser ??? We are thrilled to announce #Kaappaan release date ? – 30.08.2019 ??#KaappaanFromAug30 #KaappaanThisAug Get ready ??? @anavenkat @Suriya_offl @Mohanlal @bomanirani @Jharrisjayaraj @arya_offl @sayyeshaa pic.twitter.com/QIZcx4bvKj
— Lyca Productions (@LycaProductions) April 14, 2019