AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha krishnan: ఆ ఆలయానికి భారీ బహుమతి ఇచ్చిన హీరోయిన్ త్రిష.. ఏంటో తెలుసా..

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కుర్ర భామలకే టెన్షన్ పుట్టిస్తోంది. 42 ఏళ్ల వయసులో తెలుగు, తమిళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. తాజాగా ఓ ఆలయానికి భారీ బహుమతిని అందించింది.

Trisha krishnan: ఆ ఆలయానికి భారీ బహుమతి ఇచ్చిన హీరోయిన్ త్రిష.. ఏంటో తెలుసా..
Trisha
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2025 | 10:12 AM

Share

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ త్రిష ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తుంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈమూవీ తర్వాత దక్షిణాదిలో త్రిషకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా తమిళంలో వరుస చిత్రాలతో సత్తా చాటుతుంది ఈ బ్యూటీ. ఇప్పటికే విజయ దళపతి, అజిత్ సరసన బ్యాక్ టూ బ్యాక్స్ హిట్స్ అందుకుంది. ఈ ఏడాది విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అలరించిన త్రిష.. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. 42 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా త్రిషకు సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం.. చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా (PFCI) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి గజ అనే యాంత్రిక ఏనుగును బహుమతిగా అందించిందట త్రిష. దీనిని సాంప్రదాయ మంగళవాద్యాల మధ్య అందజేసినట్లు పీఎఫ్సీఐ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆలయ వేడుకల కోసం ఈ యాంత్రిక ఏనుగును బహుకరించడం తమిళనాడులో ఇది మొదటిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో త్రిష పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రిష చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో అలరించిన ఆమె.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంతోపాటు మలయాళంలోనూ పలు సినిమాల్లో నటిస్తున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..