AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : టాలీవుడ్‌లో దూసుకుపోతోన్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్.. ఎంతమంది ఉన్నారంటే

తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే అయితే థమన్.. లేదంటే దేవీ శ్రీ ప్రసాద్ పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పటికీ వాళ్లే రేసులో ముందున్నారు. వీళ్ళ తర్వాత కీరవాణి లాంటి వాళ్లున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోతుంది. మెల్లగా కొత్త సంగీతం తెలుగులో వినిపిస్తుంది. ఈ మధ్య సినిమా సినిమాకు ఇతర భాషా సంగీత దర్శకులను తెచ్చుకుంటున్నారు మేకర్స్.

Tollywood : టాలీవుడ్‌లో దూసుకుపోతోన్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్.. ఎంతమంది ఉన్నారంటే
Music Directors
Rajeev Rayala
|

Updated on: Oct 25, 2023 | 8:56 AM

Share

మన దర్శకులకు తమన్, దేవీ శ్రీ ప్రసాద్ బోర్ కొడుతున్నారా..? మరీ రొటీన్ ట్యూన్స్ ఇస్తున్నారని భావిస్తున్నారా..? లేదంటే టాలీవుడ్‌కు కొత్త ట్యూన్స్ వినిపించాలని ఫిక్సైపోయారా..? ఎప్పుడూ లేని విధంగా ఉన్నట్లుండి తెలుగు ఇండస్ట్రీకి ఇంతమంది సంగీత దర్శకులు ఎందుకు దిగుమతి అవుతున్నట్లు..? అసలేం జరుగుతుంది..?

తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే అయితే థమన్.. లేదంటే దేవీ శ్రీ ప్రసాద్ పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పటికీ వాళ్లే రేసులో ముందున్నారు. వీళ్ళ తర్వాత కీరవాణి లాంటి వాళ్లున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోతుంది. మెల్లగా కొత్త సంగీతం తెలుగులో వినిపిస్తుంది. ఈ మధ్య సినిమా సినిమాకు ఇతర భాషా సంగీత దర్శకులను తెచ్చుకుంటున్నారు మేకర్స్.

హేషమ్ అబ్ధుల్ వహాబ్, అజినీష్ లోక్‌నాథ్, జేక్స్ బిజాయ్, జివి ప్రకాశ్ కుమార్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఇప్పుడు చాలా మంది కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఖుషి, హాయ్ నాన్నతో రొమాంటిక్ జోనర్స్‌కు హేషమ్ కేరాఫ్‌గా మారిపోయారు. అలాగే కాంతార ఫేమ్ అజినీష్ విరూపాక్షతో మాయ చేసారు.. ఇప్పుడు మంగళవారం అంటూ వచ్చేస్తున్నారు. జివి ప్రకాశ్ చాలా రోజుల తర్వాత తెలుగులో బిజీ అయ్యారు. టైగర్ నాగేశ్వరరావుకు ఆయనే మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఆదికేశవకు సంగీతం అందిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి యువన్ ట్యూన్స్ ఇస్తున్నారు. నాని సరిపోదా శనివారం సినిమాకు జేక్స్ బిజాయ్.. దేవర, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి తెలుగులో కొత్త సంగీతం అయితే బలంగానే వినిపిస్తుంది.

View this post on Instagram

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

థమన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైమెంట్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..