Tollywood: సక్సెస్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న టాలీవుడ్ కుర్ర హీరోలు
ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు యంగ్ హీరోల పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. భారీ హిట్ కొట్టి గుర్తింపైతే తెచ్చుకున్నారు కానీ దాన్ని నిలబెట్టుకునే హిట్ కోసమే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఉనికి కోసం పోరాటం చేస్తున్న వీరులెవరో తెలుసా..? తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలే కాకుండా.. బడ్డింగ్ హీరోలు కూడా కొందరున్నారు.అదిరిపోయే బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి.. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తుంటారు వాళ్లు. అందులో విశ్వక్ సేన్ గురించి చెప్పుకోవాల్సిందే. ఫలక్‌నుమా దాస్, హిట్, ధమ్కీ లాంటి హిట్స్‌తో విశ్వక్ మార్కెట్ పెరిగింది.
ఉనికి కోసం పోరాటం.. నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడానికి ఆరాటం.. ఏంటిది పాత న్యూస్ పేపర్ హెడ్డింగ్స్‌లా ఈ కొటేషన్స్ అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు యంగ్ హీరోల పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. భారీ హిట్ కొట్టి గుర్తింపైతే తెచ్చుకున్నారు కానీ దాన్ని నిలబెట్టుకునే హిట్ కోసమే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఉనికి కోసం పోరాటం చేస్తున్న వీరులెవరో తెలుసా..? తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలే కాకుండా.. బడ్డింగ్ హీరోలు కూడా కొందరున్నారు.
అదిరిపోయే బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి.. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తుంటారు వాళ్లు. అందులో విశ్వక్ సేన్ గురించి చెప్పుకోవాల్సిందే. ఫలక్‌నుమా దాస్, హిట్, ధమ్కీ లాంటి హిట్స్‌తో విశ్వక్ మార్కెట్ పెరిగింది. ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వచ్చేస్తున్నారు మాస్ కా దాస్.
View this post on Instagram
కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని సితార ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
View this post on Instagram
ఇక మరో యంగ్ హీరో కార్తికేయ కూడా RX100 తర్వాత అలాంటి సాలిడ్ హిట్ కోసమే చూస్తున్నారు. మంచి సినిమాలైతే చేస్తున్నారు కానీ మంచి విజయాలే రావట్లేదు ఈ హీరోకు. తాజాగా ఈయన బెదురులంక 2012తో వచ్చేస్తున్నారు.
View this post on Instagram
ఆగస్ట్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. క్లాక్స్ తెరకెక్కిస్తున్న బెదురులంక సినిమా 2012 యుగాంతం నేపథ్యంలో వస్తుంది. ఇది హిట్టైతే కార్తికేయ మార్కెట్ పెరగడం ఖాయం.
View this post on Instagram
ప్రేమకథాచిత్రం తర్వాత సుధీర్ బాబుకు ఆ స్థాయి విజయం రాలేదు. ప్రస్తుతం హరోం హరతో వస్తున్నారీయన. ఇక హనుమాన్‌తో క్రేజ్ పెంచుకోవాలని ట్రయల్స్ వేస్తున్నారు తేజ సజ్జా.
View this post on Instagram
టిల్లు స్క్వేర్‌తో స్టార్ బాయ్‌గా ఫిక్సైపోవాలని డిసైడ్ అయిపోయారు సిద్ధూ జొన్నలగడ్డ. వీళ్లందరూ ప్రస్తుతం ఉనికి చాటుకునే ప్రయత్నంలోనే ఉన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.