Tuck Jagadish : నేచురల్ స్టార్ సినిమా ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపైనే పడే అవకాశం ఉందా..?
నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ మూవీ రిలీజ్ మీద క్లారిటీ వచ్చింది. డిజిటల్ రిలీజే అని చాలా రోజుల క్రితమే కమిట్ అయిన మూవీ టీమ్.. డేట్ కన్ఫామ్ చేసేందుకు చాలా టైమ్ తీసుకుంది.
Tuck Jagadish : నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ మూవీ రిలీజ్ మీద క్లారిటీ వచ్చింది. డిజిటల్ రిలీజే అని చాలా రోజుల క్రితమే కమిట్ అయిన మూవీ టీమ్.. డేట్ కన్ఫామ్ చేసేందుకు చాలా టైమ్ తీసుకుంది. ఫైనల్‌గా డిజిటల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న టక్ జగదీష్ ఎఫెక్ట్ మిగతా సినిమాల మీద ఎలా ఉండబోతోంది.? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొదటి నుంచి అనుకున్నదే అయ్యింది. ఓటీటీలో సినిమా అంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చిన చివరకు దానికే ఓటెయ్యక తప్పలేదు నానికి. వినాయక చవితి సందర్భంగా థియేటర్ స్క్రీన్స్ మీద లవ్ స్టోరి రిలీజ్ అవుతుంటే.. డిజిటల్ స్క్రీన్స్ మీద టక్ జగదీష్ రిలీజ్ కానుంది. ఏ క్లాష్ ఉండకూడదని ఇండస్ట్రీ ప్రయత్నించిందో.. అదే జరగబోతుంది. క్లాష్ తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఒకే రోజు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు చైతూ, నాని.
టక్ జగదీష్ రిలీజ్ విషయంలో క్లారిటీ రావటంతో ఇప్పుడు అందరి దృష్టి నితిన్ మాస్ట్రో మీద పడింది. ఈ మధ్య ట్రైలర్‌తో రిలీజ్ డేట్ చెప్పిన మాస్ట్రో.. తరువాత మాట వెనక్కి తీసుకున్నారు. కమింగ్ సూన్ అంటూ రిలీజ్ విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టారు. ఇప్పటి టక్ జగదీష్ రిలీజ్ మీద క్లారిటీ రావటంతో మాస్ట్రో కూడా అదే టైమ్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తారన్న టాక్ గట్టిగా వినిపించింది ఫైనల్ గా .. మాస్ట్రో’ చిత్రాన్ని సెప్టెంబర్ 17 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కి పెడుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవుతున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. ఇక శుక్రవారం(27న ) అప్‌డేట్ ఇచ్చిన శర్వానంద్ మహా సముద్రం మేకర్స్ మాత్రం డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ అని కన్ఫామ్ చేసిన ఈ టీమ్.. ఏకంగా ట్రిపులార్‌తో పోటికి దిగింది. అక్టోబర్ 14 వరల్డ్ వైడ్ రిలీజ్ అంటూ గ్రాండ్‌గా ఎనౌన్స్ చేశారు మహాసముద్రం యూనిట్. ట్రిపులార్ పోస్ట్ పోన్ అవుతుందన్న కాన్ఫిడెన్సో.. లేకపోతే మన మార్కెట్ మనకే ఉంటుందన్న నమ్మకమో తెలియదు కానీ మహా సముద్రం టీమ్ డెసిషన్‌తో ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :